ఇదే తన ఆఖరి ప్రయాణం అని 'హరికృష్ణ' కు ముందే తెలుసా.? కార్ ఎక్కుతూ ఎందుకలా అన్నారు.?  

Harikrishna Words Before Car Ride-

సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు.నెల్లూరు జిల్లాలో ఓ అభిమాని వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి ఫార్చ్యునర్ వాహనంలో బయల్దేరిన ఆయన నల్లగొండ జిల్లా అన్నెపర్తి దగ్గర ప్రమాదానికి గురయ్యారు.నార్కెట్ పల్లిలోని కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు..

Harikrishna Words Before Car Ride--Harikrishna Words Before Car Ride-

ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.ee రోజు సాయంత్రం అంతక్రియలు ముగిసాయి.

ఇది ఇలా ఉండగా …‘వస్తానో రానో.ఉంటే మాత్రం తప్పకుండా వస్తా’ అని తన కుమారుడి పెళ్లి కార్డు ఇచ్చేందుకు వెళ్లినప్పుడు హరికృష్ణ చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటూ సికింద్రాబాద్‌కు చెందిన భగ్గు హన్మంతరావు కన్నీరుమున్నీరయ్యారు.హరికృష్ణతో హన్మంతరావుది 38ఏళ్ల అనుబంధం.ఆయన హరికృష్ణకు వీరాభిమాని.కుమారుడి పెళ్లి కార్డును ఇచ్చేందుకు హన్మంతరావు మంగళవారం మధ్యాహ్నం ఆహ్వానం హోటల్‌కు వెళ్లారు.

తనను చూడగానే హన్మంతరావు బాగున్నవా, ఏంటీ ఇలా వచ్చావని అడిగినట్లు ఆయన తెలిపారు.పెళ్లి కార్డును చూస్తూ ఎప్పుడు అని అడిగారని.మీ పుట్టిన రోజునాడే అన్నా అని చెప్పినట్లు వివరించారు.నేను ఉంటానో లేదో.ఉంటే మాత్రం తప్పకుండా వస్తానని హరికృష్ణ అన్న మాటలను గుర్తుచేసుకొని హన్మంతరావు కన్నీరు పెట్టుకొన్నారు.బోనాల సందర్భంలో మహంకాళీ అమ్మవారి ఆలయానికి హన్మంతరావే తీసుకొచ్చేవారని తెలిపారు.1999లో అన్నా తెలుగుదేశంపార్టీ తరఫున సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి భగ్గు హన్మంతరావును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి స్వయంగా బీఫారాన్ని అందించడమేగాకుండా ప్రచారానికి సైతం వచ్చారు..

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

అంతేకాదు ఆయన జాతకంలో గ్రహసంచారం బాగాలేదని…దూరప్రయాణం మానుకోమని ఓ సిద్ధాంతి చెప్పారని కృష్ణ రావు చెప్పారు.డ్రైవర్ ఉన్నా సార్ ఏ కార్ నడుపుతారు.

కార్ ఎక్కుతూ పెళ్ళికి వెళ్తున్నాను మళ్ళీ వస్తానో రానో తెలీదు అన్నారంట.ఆ వీడియో మీరే చూడండి!