'నాన్నకు చివరగా అదే ఇచ్చాను..ఆ రోజు ఫోన్ చేసి అడిగేసరికి షూటింగ్ నుండి రాగానే'..కన్నీళ్లు తెప్పించే ఎన్టీఆర్ కామెంట్స్.!  

ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో గానీ, బయట జనాల్లో గానీ ఎక్క‌డ చూసిన చ‌ర్చంతా ఓకే టాపిక్ పైనే.. అందరి దృష్టి ‘అరవింద సమెత’మూవీ గురించే. రోజు రోజుకి అంచనాల‌ను అమాంతం పెంచేస్తోంది. ఎందుకంటే ఈ సినిమా కాంబినేషన్ అలాంటిది. త్రివిక్రమ్,తారక్, జ‌గ‌ప‌తిబాబు కాంబినేషన్ లో వస్తున్న తొలిచిత్రం కావడం, తమన్ బాణీలు అందించడం ఇలా ఎన్నో విశేషాలున్నాయి. దసరా పండుగ సందర్బంగా అక్టోబర్ 11న ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా ఆడియో వేడుక ఇటీవలే జరిగింది.

Harikrishna Asked Me To Send Palav Jr Ntr-

Harikrishna Asked Me To Send Palav Jr Ntr

ముఖ్యంగా తండ్రి హరికృష్ణ గారిని కోల్పోయిన బాధ ఎన్టీఆర్ లో చాలా కనిపించింది. ఎక్కువగా హరికృష్ణ గారితో గడిపిన చివరిక్షణాల గురించి చెప్పాడు ఈ ఆడియో వేడుకలో. తారక్ వంట బాగా చేస్తారని అందరికి తెలిసిందే. తారక్ తన తండ్రికి చివరిసారిగా భోజనం పంపించిన విషయం గురించి వివరించాడు.

నాన్న మరణానికి కొద్దీ రోజుల ముందు నాకు ఫోన్ చేసి పలావ్ కావాలని చెప్పారు. దీంతో షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళగానే స్పెషల్ గా పలావ్ చేసి నాన్నకు పంపించానని ఎన్టీఆర్ తెలుపుతూ.. చివరిసారిగా నాన్నగారికి అదే ఇచ్చాను అని తెలిపాడు. ఇక తండ్రిని తలచుకొని తారక్ కొంత ఆవేదనకు లోనయ్యాడు.