బిబి4 : హారిక మాస్‌ డాన్స్‌ తో దేత్తడి అనిపిస్తే.. మోనాల్‌ హీరోయిన్‌ అనిపించుకుంది  

Harika and monal dance in big boss 4 show, akhil, monal gajjar, sohel, mehaboob, harika, - Telugu Akhil, Harika, Mehaboob, Monal Gajjar, Sohel

తెలుగు బిగ్‌ బాస్‌ నిన్నటి ఎపిసోడ్‌ కమర్షియల్‌ సినిమాను తలపించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఒక వైపు లవ్‌ స్టోరీ మరో వైపు ఆకట్టుకునే ఎంటర్‌టైన్‌ మెంట్‌ తో నిన్నటి ఎపిసోడ్‌ ప్రేక్షకులకు కన్నుల వింధు చేసింది.

 Harika And Monal Dance In Big Boss 4 Show

మోనాల్‌ మరియు అఖిల్‌ ల మద్య జరుగుతున్న లవ్‌ ట్రాక్‌ కారణంగా షో మొత్తం వారిద్దరి గురించి ఫోకస్ అవుతోంది.వీరిద్దరికి మద్యలో అభిజిత్‌ కూడా ఉన్నాడా అనిపిస్తుంది.

అభిజిత్‌ కూడా లవ్‌ ట్రాక్‌ లో ఉంటే ఖచ్చితంగా ఇది ఒక ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీ అవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.అఖిల్‌ తాను ఇష్టపడుతున్న మోనాల్‌ ఇతరులతో ఉన్న సమయంలో కాస్త ఇబ్బందిగా ఫీల్‌ అవుతున్నాడు.

బిబి4 : హారిక మాస్‌ డాన్స్‌ తో దేత్తడి అనిపిస్తే.. మోనాల్‌ హీరోయిన్‌ అనిపించుకుంది-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

టాస్క్‌ లో భాగంగా బిగ్‌ బాస్‌ డాన్స్‌ కాంపిటీషన్‌ పెట్టగా సోహెల్‌ మరియు మోనాల్‌లకు జత కుదిరించాడు.ఆ సమయంలో అఖిల్‌ ఎక్స్‌ ప్రెషన్స్‌ చూడాలి.

ఇక మరో జోడీగా దేత్తడి హారిక మరియు మెహబూబ్‌లు ఉన్నారు.వీరిద్దరి జోడీ టాప్‌ లేచి పోద్ది పాటకు డాన్స్ చేయగా, మోనాల్‌ జోడీ హాట్‌ ఫెర్ఫార్మెన్స్‌ ఇచ్చింది.

మోనాల్‌, సోహెల్‌లతో ప్రారంభం అవ్వగా వారిద్దరి డాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.వారి కాస్ట్యూమ్స్‌ నుండి మొదలుకుని వారి డాన్స్‌ అదిరి పోయింది.హారిక మరియు మెహబూబ్‌ కూడా డాన్స్ తో అదరగొట్టారు.ఇద్దరు దుమ్ము లేచి పోయేలా డాన్స్‌ చేయడంతో పాటు వారి మద్య రొమాన్స్‌ మరియు కో ఆర్డినేషన్‌ కేక పుట్టించింది.

హారిక మాస్ స్టెప్పులు మరియు మెహబూబ్‌ ఎనర్జిటిక్‌ పెర్ఫార్మెన్స్‌ నిన్నటి ఎపిసోడ్‌ కు హైలైట్‌గా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.తెలుగు బిగ్‌బాస్‌లో ఇప్పటి వరకు ఇలాంటి డాన్స్‌ పెర్ఫార్మెన్స్‌ చూసి ఉండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ టాక్‌ వినిపిస్తుంది.

ఇక మోనాల్‌ ఒక హీరోయిన్‌ అవ్వడంతో ఆ స్థాయిలోనే ఆమె డాన్స్ చేసింది.చాలా కూల్‌గా ఒక క్యూట్‌ డాల్‌ మాదిరిగా ఆమె డాన్స్‌ చేసి అలరించింది.

అద్బుతమైన హావభావాలు కూడా ఆమె ఇచ్చింది.వాన పాట అవ్వడంతో డ్రస్‌ తడుపుకుని ఇద్దరు కూడా చేసిన తీరు బాగుంది.

ఇక నేటి ఎపిసోడ్‌ లో ఒక జోకర్‌ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.ఆ జోకర్‌ జబర్దస్త్‌ కమెడియన్‌ ముక్కు అవినాష్‌ అయ్యి ఉంటాడు అంటూ టాక్‌ వస్తుంది.

నేటి ఎపిసోడ్‌ లో ఆ విషయం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

#Monal Gajjar #Mehaboob #Akhil #Harika #Sohel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Harika And Monal Dance In Big Boss 4 Show Related Telugu News,Photos/Pics,Images..