'హరిహర వీరమల్లు' టీజర్ విడుదల అప్పుడేనా..?!

ఎం.ఎం.రత్నం సమర్పణలో పాన్ ఇండియా సినిమాగా పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా దర్శకధీరుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ సినిమా హరిహర వీరమల్లు.ఈ చిత్రాన్ని దయాకర్ రావు నిర్మిస్తుండగా పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

 'harihara Veeramallu' Teaser Release Then  Pawan Kalyan, Power Star, First Look,-TeluguStop.com

ఈ సినిమాకు సంబంధించి ఇదివరకే ఫస్ట్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ లుక్ కి పెద్ద ఎత్తున మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇకపోతే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి నెట్టింట్లోఅనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ డేట్ గురించి పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2న ఈ సినిమాకు సంబంధించి టీజర్ విడుదల చేస్తారని తెలుస్తోంది.పీరియాడికల్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో 17వ శతాబ్దం నేపథ్యంగా సాగే విధంగా ఈ చిత్ర కథాంశం ఉంటుందని తెలుస్తోంది.

ఇందుకు సంబంధించి చిత్రీకరణ దాదాపు సగం వరకు పూర్తయిందని టాలీవుడ్ సమాచారం.

Telugu Pawan Kalyan, Teaser-Latest News - Telugu

ఈ సినిమాకు సంబంధించి బాలీవుడ్ లో స్టంట్ కొరియోగ్రాఫర్ గా పేరు పొందిన శ్యామ్ కౌశల్ నేతృత్వంలో పవన్ కళ్యాణ్ కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం.హరిహర వీరమల్లు సినిమాకి బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందిస్తుండగా సినిమాకి సంగీతాన్ని సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అందిస్తున్నారు.ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ ఎంత భారీ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube