వైరల్: రెండు చేతుల్లో తుపాకులతో డ్యాన్స్  

Man Seen Dance With Two Guns In Haridwar - Telugu Dancing With Guns, Haridwar, Man Seen Dance With Two Guns, Telugu Viral News Updates

సెల్ఫీలు,వీడియోల విషయంలో ఎన్ని ఘటనలు చోటుచేసుకుంటున్న జనాల్లో మాత్రం మార్పులు రావడం లేదు.ఈ సెల్ఫీలు,వీడియో ల పిచ్చిన ఒక వ్యక్తి తుపాకులు పట్టుకొని మరి డ్యాన్స్ చేశాడు.

Man Seen Dance With Two Guns In Haridwar

ఈ ఘటన ఉత్తరా ఖండ్ లో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే… సుమారు 40 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి తన నివాసంలో తన రెండు చేతుల్లో రెండు తుపాకులను పట్టుకొని డ్యాన్స్ చేసాడు.

అయితే ఆ వీడియో కాస్త సోషల్ మీడియా లోకి రావడం ఇప్పుడు ఆ వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.ఆ వీడియో లో 40 ఏళ్ల వ్యక్తి హిందీ పాటకు అనుగుణంగా స్టెప్పులేస్తూ రెండు చేతుల్లో రెండు గన్ లు పట్టుకున్నాడు.

వైరల్: రెండు చేతుల్లో తుపాకులతో డ్యాన్స్-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఆ వీడియో కాస్త సోషల్ మీడియా లో వైరల్ గా మారడం తో ఇప్పుడా విషయం కాస్త ఉత్తరాఖండ్ పోలీసుల దాకా చేరింది.దీనిపై అధికారులు స్పందిస్తూ అసలు ఈ వీడియో ఎక్కడ నుంచి వచ్చింది అసలు ఆ వ్యక్తి ఎవరు అన్న వివరాల పై కూపీ లాగుతున్నారు.

ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్నామని వ్యక్తిని గుర్తించిన అనంతరం అతని పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

 ఇలాంటి వీడియో లు సోషల్ మీడియా లో హల్ చల్ చేయడం ఇదే తొలిసారి ఏమీ కాదు.గతంలో కూడా పలువురు అధికారులు,రాజకీయ నేతలు కూడా ఇలాంటి వీడియో లలో చిక్కి కష్టాల్లో పడ్డారు.మరి అయితే ఇతడు ఎవరు,అసలు గన్ లతో అలా డ్యాన్స్ ఎందుకు చేశాడు అన్న వివరాలు తెలియాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Man Seen Dance With Two Guns In Haridwar-haridwar,man Seen Dance With Two Guns,telugu Viral News Updates Related....