ఆడపిల్లలు పుట్టారని ఊరి జనం ఏం చేశారంటే..?

ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు పుట్టారంటే చాలు ఆ ఇంట్లో వారి మొహాలు అదోరకంగా పెట్టుకుంటారు.అబ్బాయి పుట్టుంటే బాగుండేది అని వారు గుసగుసలాడుకుంటారు.

 Haridaspur Village Celebrates For Baby Girls-TeluguStop.com

అదే అబ్బాయి పడితే మాత్రం చుట్టాలందరినీ పిలిచి గ్రాండ్‌గా దావత్ ఇచ్చేస్తారు.మరి అదే దావత్ అమ్మాయి పుట్టినందుకు ఇస్తే.

వారికి అమ్మాయిలు లేరేమో అనుకుంటాం.కానీ ఊరంతా దావత్ ఇస్తే.

ఇదేదో తెలుసుకోవాల్సిన ముచ్చట అంటారు కదా.

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా హరిదాస్‌పూర్‌ గ్రామంలో వరుసగా అబ్బాయిలే పుడుతున్నారు.దీంతో ఆ గ్రామ పెద్దలు అబ్బాయిల సంఖ్య ఎక్కువవుతుందని, అమ్మాయిల సంఖ్య బాగా తగ్గిపోయింది.దీంతో ఆ గ్రామంలోని ప్రజలు అమ్మాయిలు పుట్టాలని మొక్కని దేవుడు లేడు, తిరగని గుడి లేదు అన్న చందాన దేవుడిని వేడుకున్నారు.

అయితే వారి ప్రార్ధనలను దేవుడు నిజంగానే విన్నట్లు ఉన్నాడు.ఈ ఏడాది జనవరి మొదటి వారంలో గ్రామంలో ఏకంగా ముగ్గురు అమ్మాయిలు జన్మించారు.

దీంతో ఆ గ్రామంలో పండగ వాతావరణం ఏర్పడింది.ఆడపిల్లలు పుట్టినందుకు ఆ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.

ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు.ఊరంతా విద్యుత్ దీపాలతో అలంకరించి పెద్ద ఎత్తున దావత్ చేసుకున్నారు.

ఏదేమైనా ఆడపిల్ల పుట్టినందుకు వేడుకలు చేసుకున్నారంటే ఆ గ్రామంలో అమ్మాయిల సంఖ్య ఎంత తక్కువగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.ఈ గ్రామ ప్రజలు ఇతర గ్రామాలవారికి ఆర్శంగా నిలిచారని స్థానికులు వారిని ప్రశంసిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube