Chiranjeevi Hari Prasad: లైవ్ డిబేట్ లో కన్ను మూసినా చిరంజీవి స్నేహితుడు

చిరంజీవి రూమ్ మేట్ అయినా అయినా హరి ప్రసాద్ మీకందరికి గుర్తుండే ఉంటాడు.తొలినాళ్లలో చిరు తో సమానంగా హీరో అవ్వాలని ప్రయత్నాలు చేసాడు.

 Hari Prasad Sad Ending In Live Debate Details, Chiranjeevi, Hari Prasad, Chiranj-TeluguStop.com

కానీ కాలం అందరిని ఒకేలా ఎందుకు చూస్తుంది.సరైన అవకాశాలు రాకపోవడం తో కెరీర్ పెద్దగా ఏమి సాగలేదు.

తెలుగు లో హరి ప్రసాద్ నటించిన సినిమాలను వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు.తనతో ఉన్న స్నేహితులను ఎలాగైనా సెటిల్ చేయాలనీ చిరంజీవి భావించాడు.

అప్పటికే చిరంజీవి మరొక రూమ్ మేట్ అయినా సుధాకర్ కూడా తమిళ్ లో హీరో గా కెరీర్ ముగిసిపోయి కమెడియన్ గా తెలుగులో సెటిల్ అవుతున్నాడు.దాంతో తన ఇద్దరి స్నేహితులను సెటిల్ చేయాలనీ అనుకున్నాడు.

అనుకున్నదే తడవుగా ఇద్దరు స్నేహితులకు మరొక ఫ్రెండ్ అయినా నారాయణ రావు ని జత చేసి యముడికి మొగుడు అనే సినిమా చేయించాడు.స్నేహితులను నిర్మాతలుగా మార్చి ఈ సినిమా లో హీరో గా నటించాడు చిరు.

ఆ తర్వాత కన్నడ సినీ పరిశ్రమకు వెళ్ళిపోయినా హరి ప్రసాద్ పెద్దగా నిలదొక్కుకోలేకపోయాడు.సినిమా నిర్మాణం చేసి చేతులు కాల్చుకున్నాడు.ఆ తర్వాత సీరియల్స్ లో కూడా నటించాడు.కెరీర్ మొత్తం కోల్పోయిన తర్వాత మళ్లి చిరంజీవి దగ్గరికి చేరాడు.

అప్పటికి చిరంజీవి సినిమాలు మానేసి ప్రజా రాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చాడు.దాంతో హరి ప్రసాద్ కి మరొక అవకాశం దక్కింది.

Telugu Chiranjeevi, Chiranjeevihari, Hari Prasad, Yanarao, Prajarajyam, Sudhakar

తన ఏరియా లో మంచి నాయకుడిగా ఉండాలని చిరంజీవి ఆశీస్సులతో ప్రజా రాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు.కొన్నాళ్ల పాటు సేవ బాగానే సేవ చేసాడు.ప్రజా రాజ్యం పార్టీ కోసం తన పరిధిలో బాగా ట్రై చేసాడు.పార్టీ కార్యకలాపాలను చక్కగా చేసాడు.ఒక రోజు పార్టీ క్యాంపెయిన్ జరుగుతున్న సమయంలో టీవీ 9 ఛానెల్ లో లైవ్ డిబేట్ లో పాల్గొనాల్సి ఉండగా స్టూడియో కి చేరుకున్నారు.డిబేట్ మొదలవ్వగానే ఆవేశంగా మాట్లాడుతున్న హరి ప్రసాద్ కి సడన్ హార్ట్ అటాక్ వచ్చింది.

అక్కడే కుప్పకూలిపోయాడు.హాస్పిటల్ కి తీసుకెళ్లిన కూడా బ్రతకలేదు.

ఆలా స్నేహితుడి పెట్టిన పార్టీ లో అడుగుపెట్టి లైవ్ డెబిట్ లో కన్ను మూసాడు హరి ప్రసాద్.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube