రిలీజ్ డేట్‌తో వచ్చిన హరిహర వీరమల్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ షూటింగ్ చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో పవన్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.

 Hari Hara Veeramallu Release Date Locked, Hari Hara Veeramallu, Pawan Kalyan, Kr-TeluguStop.com

ఈ సినిమాలో పవన్‌తో పాటు రానా దగ్గుబాటి కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో రానా దగ్గుబాటి కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో కూడా నటిస్తున్నాడు.ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కి్స్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

ఈ సినిమాను పీరియాడికల్ మూవీగా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో పవన్ లుక్ ఎలా ఉంటుందో ఇప్పటికే రివీల్ చేశారు చిత్ర యూనిట్.ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.ఏప్రిల్ 29, 2022 నాడు హరిహర వీరమల్లు సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

ఇప్పటికే కరోనా కారణంగా ఆలస్యం అయిన ఈ సినిమాను వచ్చే వేసవి కానుకగా రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా మంచి హైప్ క్రియేట్ అయ్యింది.ఇక ఈ సినిమాలో పవన్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

పాన్ ఇండియా మూవీగా హరిహర వీరమల్లు చిత్రాన్ని తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.ఈ సినిమాను ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

మరి హరిహర వీరమల్లు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో తెలియాలంటే ఏప్రిల్ 29 వరకు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube