మెగాస్టార్ కు నో చెప్పిన హరీష్ శంకర్.. కారణమిదే..?  

has hareesh shankar rejected megastar chiranjeevi proposal for loosifer remake,megastar chiranjeevi,pavan,koratala shiva,aacharya,vedalam - Telugu Aacharya, Chiranjeevi, Harish Shankar, Koratala Shiva, Lucifer Remake, Megastar Harish Shankar, Pavan, Vedalam, Vv Vinayak Sujeeth

పదేళ్ల పాటు రాజకీయాల్లో బిజీ కావడం వల్ల సినిమాలకు దూరమైన చిరంజీవి రీఎంట్రీలో వరుసగా సినిమాలకు కమిటవుతూ కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే.రీఎంట్రీలో ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలతో వరుస విజయాలు అందుకున్న చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నారు.

TeluguStop.com - Hareesh Shankar Says No To Megastar Lucifer Remake

ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి

ఆచార్య షూటింగ్ పూర్తైన తరువాత చిరంజీవి వేదాళం, లూసిఫర్ రీమేక్ లలో నటించనున్నారు.వేదాళం రీమేక్ విషయంలో ఎటువంటి సమస్యలు లేకపోయినా లూసిఫర్ సినిమా డైరెక్టర్ విషయంలోనే గందరగోళం నెలకొంది.

TeluguStop.com - మెగాస్టార్ కు నో చెప్పిన హరీష్ శంకర్.. కారణమిదే..-General-Telugu-Telugu Tollywood Photo Image

మొదట ఈ సినిమాకు సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తాడని వార్తలు వచ్చాయి.అయితే సుజీత్ స్క్రిప్ట్ లో చేసిన మార్పులు చిరంజీవిని మెప్పించలేకపోయాయి

ఆ తరువాత చిరంజీవికి రీమేక్ సినిమాలతో విజయాలు అందించిన వీవీ వినాయక్ పేరు వినిపించింది.

అయితే వినాయక్ సైతం లూసిఫర్ స్క్రిప్ట్ ను తెలుగు నేటివిటీకి తగినట్లుగా మార్చలేకపోవడం, వినాయక్ చెప్పిన కామెడీ సీన్లు చిరంజీవికి నచ్చకపోవడంతో వినాయక్ సైతం ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి.ఆ తరువాత దబాంగ్ రీమేక్ తో పవన్ కు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ పేరు వినిపించింది

అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం హరీష్ శంకర్ సైతం లూసిఫర్ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది.

సరైన కారణాలు తెలియకపోయినా పవన్ కళ్యాణ్ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉండటం వల్లే హరీష్ శంకర్ లూసిఫర్ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.అయితే వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే.

#Lucifer Remake #Harish Shankar #MegastarHarish #Vedalam #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hareesh Shankar Says No To Megastar Lucifer Remake Related Telugu News,Photos/Pics,Images..