భారత్-వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్లో ఓటమిపై స్పందించిన హార్దిక్ పాండ్యా..!

వెస్టిండీస్ ( West Indies )పర్యటనలో భాగంగా వెస్టిండీస్ తో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ ఓటమిని చవిచూసింది.చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో నాలుగు పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది.

తొలి మ్యాచ్లో ఓడిన అనంతరం భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా( Hardik Pandya ) స్పందిస్తూ.ఓడిన మ్యాచ్ నుండి పుంజుకుని మిగతా మ్యాచ్లలో రాణించి సిరీస్ గెలిచే ప్రయత్నం చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు.తామంతా గెలుపు ఓటముల నుంచి నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపాడు.

వెస్టిండీస్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్య చేదనలో ఒక దశలో మెరుగు గానే ఉన్న.కీలక సమయాలలో చేసిన పొరపాట్ల వల్ల ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని తెలిపాడు.

కుర్రాళ్లతో కూడిన జట్టు తెలియని తప్పులు చేయడం సహజమే.వాటి నుండి నేర్చుకొని మెరుగుపడతామని తెలిపాడు.

Advertisement

మ్యాచ్ మొత్తం భారత జట్టు ఆధీనంలోనే ఉన్నప్పటికీ అనుకోని సమయాలలో వెనువెంటనే వికెట్లు పడడంతో చేదన కష్టమైందని తెలిపాడు.

ఇక భారత జట్టు ఆటగాళ్ల విషయానికి వస్తే అక్షర్ పటేల్( Axar Patel ) బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోను కీలక ఆటగాడని బరిలోకి తీసుకున్నామని తెలిపాడు.యువ ఆటగాడు తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని తెలిపాడు.పేసర్ ముఖేష్ కుమార్ మూడు ఫార్మాట్లలోను ఆరంగేట్రం చేశాడు.

ఇక టీ20 మ్యాచ్లలో ఏ క్షణాన మ్యాచ్ ఎటువైపు మలుపు తిరుగుతుందో ఎవరు ఊహించలేరు.ఈ మ్యాచ్ లో మరో రెండో లేదా మూడు భారీ షాట్లు ఆడి ఉంటే కనుక తప్పకుండా భారత్ విజయం సాధించాలని హార్థిక్ పాండ్యా తెలిపాడుఇక వెస్టిండీస్ జట్టు కెప్టెన్ రోవన్ పావెల్ విజయం పై స్పందిస్తూ పరిస్థితులను సద్వినియోగం చేసుకొని రాణించడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా జాసన్ హోల్డర్ నిలిచాడు.రెండు జట్లు తదుపరి మ్యాచ్లో గెలవాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.

చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!
Advertisement

తాజా వార్తలు