భారత్-వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్లో ఓటమిపై స్పందించిన హార్దిక్ పాండ్యా..!

వెస్టిండీస్ ( West Indies )పర్యటనలో భాగంగా వెస్టిండీస్ తో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ ఓటమిని చవిచూసింది.చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో నాలుగు పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది.

 Hardik Pandya Reacted To The Defeat In The First T20 Match Between India And Wes-TeluguStop.com
Telugu Axar Patel, Hardik Pandya, India, Jason Holder, Latest Telugu, Tilak Varm

తొలి మ్యాచ్లో ఓడిన అనంతరం భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా( Hardik Pandya ) స్పందిస్తూ.ఓడిన మ్యాచ్ నుండి పుంజుకుని మిగతా మ్యాచ్లలో రాణించి సిరీస్ గెలిచే ప్రయత్నం చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు.తామంతా గెలుపు ఓటముల నుంచి నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపాడు.వెస్టిండీస్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్య చేదనలో ఒక దశలో మెరుగు గానే ఉన్న.

కీలక సమయాలలో చేసిన పొరపాట్ల వల్ల ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని తెలిపాడు.కుర్రాళ్లతో కూడిన జట్టు తెలియని తప్పులు చేయడం సహజమే.వాటి నుండి నేర్చుకొని మెరుగుపడతామని తెలిపాడు.మ్యాచ్ మొత్తం భారత జట్టు ఆధీనంలోనే ఉన్నప్పటికీ అనుకోని సమయాలలో వెనువెంటనే వికెట్లు పడడంతో చేదన కష్టమైందని తెలిపాడు.

Telugu Axar Patel, Hardik Pandya, India, Jason Holder, Latest Telugu, Tilak Varm

ఇక భారత జట్టు ఆటగాళ్ల విషయానికి వస్తే అక్షర్ పటేల్( Axar Patel ) బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోను కీలక ఆటగాడని బరిలోకి తీసుకున్నామని తెలిపాడు.యువ ఆటగాడు తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని తెలిపాడు.పేసర్ ముఖేష్ కుమార్ మూడు ఫార్మాట్లలోను ఆరంగేట్రం చేశాడు.ఇక టీ20 మ్యాచ్లలో ఏ క్షణాన మ్యాచ్ ఎటువైపు మలుపు తిరుగుతుందో ఎవరు ఊహించలేరు.ఈ మ్యాచ్ లో మరో రెండో లేదా మూడు భారీ షాట్లు ఆడి ఉంటే కనుక తప్పకుండా భారత్ విజయం సాధించాలని హార్థిక్ పాండ్యా తెలిపాడుఇక వెస్టిండీస్ జట్టు కెప్టెన్ రోవన్ పావెల్ విజయం పై స్పందిస్తూ పరిస్థితులను సద్వినియోగం చేసుకొని రాణించడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా జాసన్ హోల్డర్ నిలిచాడు.

రెండు జట్లు తదుపరి మ్యాచ్లో గెలవాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube