తగ్గేదేలే అంటున్న హార్దిక్ పాండ్య నాన్నమ్మ.. పుష్ప ఫీవర్ మాములుగా లేదుగా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కిన చిత్రం పుష్ప.ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఇంకా ఈ సినిమా ఫీవర్ ప్రేక్షకులలో తగ్గలేదు అని చెప్పాలి.

 Hardik Pandya And His Nani Pulled Allu Arjun Srivalli Hook Step Video Gone Viral-TeluguStop.com

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈచిత్రం దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాలలో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని విపరీతంగా ఆకట్టుకుంది.ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన శ్రీ వల్లి అనే పాటకు ఎంతో ఆదరణ లభించింది అని చెప్పాలి.

ఈ పాటకు అచ్చం అల్లు అర్జున్ స్టైల్ లోనే ఎంతోమంది డాన్స్ వీడియోలను చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.కేవలం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో సైతం అల్లు అర్జున్ స్టెప్పులను అనుసరిస్తూ డాన్స్ చేస్తున్నారు అంటే పుష్ప క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇక ఇప్పటి వరకు ఈ పాటకు ఎంతోమంది డాన్స్ వీడియోలు చేయగా తాజాగా మరొక బామ్మ కూడా పుష్ప శ్రీవల్లి పాటకు అద్భుతమైన స్టెప్పులు వేస్తూ తగ్గేదే లే అంటూ డాన్స్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అయితే ఎంతో ఉత్సాహంతో వయసు సహకరించకపోయినా డాన్స్ చేసిన ఈ బామ్మ మరెవరో కాదు టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా నాన్నమ్మ.ఈమె పుష్ప సినిమాలో ఈ పాటకు డాన్స్ చేస్తూ అత్యంత ఉత్సాహంగా కనబడుతున్నారు.ఇక ఈ వీడియోలో తన నాన్నమ్మ పక్కనే హార్దిక్ ఉండడం విశేషం.

ఈ వీడియోని హార్దిక్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ…”అవర్‌ ఓన్‌ పుష్ప నాని” అంటూ హార్ధిక్‌ ఈ పోస్ట్‌కు క్యాప్షన్‌ జోడించాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు బామ్మ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube