సినిమా ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్లు చాలా ప్రమాదకరం...

సినిమా అనేది రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో రాణించాలంటే నటనా ప్రతిభ మాత్రమే కాదు క్లిష్ట పరిస్థితుల నుంచి బయట పడే మార్గాలు మరియు కెరియర్ పరంగా ఎదురయ్యే ఒత్తిడులను కూడా తట్టుకోగలిగే శక్తి ఉండాలి.

 Harbhajan Singh Wife Geeta Basra About Love Affairs In Film Industry, Harbhajan-TeluguStop.com

వీటితో పాటు క్రమశిక్షణ మరియు విచక్షణ కూడా చాలా అవసరం.ఎందుకంటే ఒక్కోసారి మన ప్రమేయం ఏ మాత్రం లేకున్నప్పటికీ ఇతరుల పట్ల మనం ప్రవర్తించే తీరు కారణంగా కూడా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇందులో భాగంగానే కొంతమంది నటీనటుల సినిమా పరిశ్రమలో ఎఫైర్లు, ప్రేమ వ్యవహారాలు, పెళ్లిళ్లు వంటి వాటి కారణంగా తమ సినిమా కెరీర్ని పోగొట్టుకున్న వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు.

కాగా తాజాగా ఈ విషయంపై భారత క్రికెట్ జట్టు మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ భార్య గీత బాసర స్పందించింది.

అయితే సినిమా పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు మరియు అనైతిక సంబంధాలు వారి కెరియర్ పై తీవ్ర ప్రభావం చూపుతాయని అందువల్లనే తాను ఇలాంటి విషయాలకు చాలా దూరంగా ఉంటూ తన కెరియర్లో చాలా జాగ్రత్త పడ్డానని తెలిపింది.ఇక హర్భజన్ తో ప్రేమ వివాహం పై స్పందిస్తూ ఒకరినొకరు క్షుణ్నంగా తెలుసుకున్న తర్వాతే ఇద్దరం వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నామని ఇందులో భాగంగా తాము ముందుగా అనుకున్న విధంగానే పెళ్లికి ముందు కొంత కాలం పాటు డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది.

అయితే తాను సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజులలో ఓ బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ స్టార్ హీరోయిన్ కి భారీ బడ్జెట్ సినిమాలో అవకాశం వచ్చిందని కానీ ఆ హీరోయిన్ అనుకోకుండా ఆ చిత్రం షూటింగ్ పనులు మొదలవడానికి ముందే పెళ్లి చేసుకోవడంతో చిత్ర యూనిట్ సభ్యులు ఆమెని సినిమా నుంచి తప్పించారని చెప్పుకొచ్చింది.అయితే ఇందుకు గల కారణాలను వివరిస్తూ ఒకవేళ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో హీరోయిన్ గర్భం దాలిస్తే చిత్ర షూటింగ్ పనులు నిలిపివేయాల్సి ఉంటుందని అందువల్లనే ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారట.

అందువల్లనే మాతృత్వం అనేది మహిళ జీవితంలో ముఖ్యమైనదే అయినప్పటికీ ఒక్కోసారి అనుకోని పరిస్థితులవల్ల ఆ పిలుపుకి దూరం కావాల్సి వస్తుందని కూడా తన అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఇలాంటి కారణాలను దృష్టిలో ఉంచుకొని పెళ్లయిన తర్వాత గీత బాసర సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది.

కాగా గీత బాసర చివరిగా పంజాబీ భాషలో “లాక్” అనే చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలో నటించింది.కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.దీంతో ప్రస్తుతం కుటుంబ బాధ్యతలను చక్కబెడుతూ ఇంటిపట్టునే ఉంటుంది.ఇక హర్భజన్ సింగ్ విషయానికొస్తే ప్రస్తుతం బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐపీఎల్ టోర్నమెంట్లో “కోల్కతా నైట్ రైడర్స్” జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

అలాగే తమిళంలో “ఫ్రెండ్ షిప్” చిత్రంలో హీరోగా నటిస్తూ కోలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోగా పరిచయమవుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube