బయోపిక్ గా రానున్న హర్భజన్ జీవిత కథ..

ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న మాట బయోపిక్.ఇప్పుడు అంతా బయోపిక్స్ ట్రెండ్ నడుస్తుంది.ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీల బయోపిక్స్ రూపొందించబడ్డాయి.సినీ, రాజకీయ ప్రముఖులు, క్రికెటర్లు వంటి వారి బయోపిక్స్ రూపొందించారు.సెలెబ్రిటీల జీవితాల్లో జరిగిన సంఘటనలను.వారు ఎదుర్కొన్న తీరును, వారి కష్టసుఖాలను బయోపిక్స్ రూపంలో చూపిస్తున్నారు.

 Harbhajan Singh Wants This Actor To Play Him Onscreen, Wife Geeta Basra Disagree-TeluguStop.com

అయితే తాజాగా హర్భజన్ సింగ్ జీవిత కథ కూడా బయోపిక్ రూపంలో రాబోతుందని టాక్ నడుస్తుంది.హర్భజన్ తన బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టును హడలెత్తించాడు.త్వరలోనే బయోపిక్ గురించిన మరింత సమాచారం బయటకు రానుంది.అయితే తన బయోపిక్ విషయంలో హర్భజన్ సింగ్ పాజిటివ్ గానే ఉన్నట్లు సమాచారం.

అయితే హర్భజన్ ప్రస్తుతం క్రికెట్ కు గుడ్ బై చెప్పి సినీ రంగ ప్రవేశం చేసాడు.హర్భజన్ గీతా బర్సాను చాలా కాలం ప్రేమించుకున్న తర్వాత 2015 లో పెళ్లి చేసుకున్నాడు.

వీరికి ఒక పాప కూడా ఉంది.ప్రస్తుతం హర్భజన్ సింగ్ తమిళ సినిమాలో అర్జున్‌తో కలిసి ఫ్రెండ్‌షిప్ అనే చిత్రంలో నటిస్తున్నారు.

త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ అవ్వనుంది.

Telugu Biopic, Cricket, Geeta Basra, Harbhajan Singh-Movie

ఈ నేపథ్యంలో తన బయోపిక్ గురించి స్పందిస్తూ.బయోపిక్ రూపొందిస్తే తన పాత్రలో తానే హీరోగా నటిస్తానని చెప్పాడు.ఎందుకంటే నా పాత్రకు నేను తప్ప ఎవరు న్యాయం చేయలేరని కాబట్టి నా పాత్రలో నేనే నటిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు.

ఒకవేళ నేను నటించకపోతే నా పాత్రకు రణ్ వీర్ సింగ్ అయితే న్యాయం చేయగలడని బజ్జీ వివరించాడు.

ఇక తన భార్య పాత్రలో కియారా అయితే కరెక్ట్ గా సరిపోతుందని హర్భజన్ తన మనసులోని భావాలను వెల్లడించారు.

అయితే ఇందుకు ఆయన భార్య గీత వ్యతిరేకించారు.గీత స్పందిస్తూ హర్భజన్ పాత్రలో వికీ కౌశల్ అయితే బాగుంటాడని.

తన పాత్రకు ప్రియాంక చోప్రా అయితే బాగుటుందని తెలిపింది.అయితే హర్భజన్ బయోపిక్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube