ధోనీ రనౌట్ విషయంలో అంపైర్ల నిర్ణయం పై అసంతృప్తి వ్యక్తం చేసిన హర్భజన్  

Harbhajan Not Satisfied For The Dhoni Runout Decision -

ఇండియన్ ప్రీమియర్ లీగ్( ఐపీఎల్) 2019 విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచిన సంగతి తెలిసిందే.అయితే ఈ మ్యాచ్ జరిగి రెండు రోజులు అవుతున్నా అభిమానులు మాత్రం ఇంకా అదే లోకంలో ఉన్నారు.

Harbhajan Not Satisfied For The Dhoni Runout Decision

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూసిన తరువాత ఇప్పుడు అందరూ ఒకే విషయం గురించే మాట్లాడుకుంటున్నారు.అదే మాజీ టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అవుట్ గురించే.

ఎలాంటి పరిస్థితులలో అయినా సింగిల్స్,డబుల్స్ రాబట్టడం లో దిట్ట అయిన ధోని మ్యాచ్ చేతికి వస్తుంది అనుకున్న సమయంలో అనూహ్యంగా అవుట్ అవ్వడం అభిమానులను షాక్ కు గురిచేసింది.ముఖ్యంగా చెన్నై అభిమానులయితే అంపైర్ల తీరుపై సోషల్ మీడియా ద్వారా ఏకిపారేస్తున్నారు.

అయితే అభిమానుల అనుమానాలకు బలాన్ని చేకురుస్తూ తాజాగా చెన్నై బౌలర్ హర్భజన్ సింగ్ కూడా ధోని రనౌట్ పై ఆసక్తికర కామెంట్ చేశాడు.

ఏదైనా నిర్మొహమాటం గా మొహం పై చెప్పే హర్భజన్ సింగ్ తాజాగా ధోనీ రనౌట్ పై మాట్లాడాడు.

దీనితో ధోని అవుట్ పై అభిమానుల అనుమానాలకు ఆర్జమ్ పోసినట్టు అయ్యింది.ముంబైతో తాము తలపడ్డ ఐపిఎల్ ఫైనల్లో లెక్కకు మించిన తప్పులు జరిగాయని, ముఖ్యంగా మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో మహేంద్ర సింగ్ రనౌట్ నిర్ణయం మా జట్టుకు కోలుకోలేని దెబ్బ పడినట్లు అయ్యింది అని భజ్జి వ్యాఖ్యానించారు.

ధోని రనౌట్ పై స్పష్టత లేనపుడు బెన్ఫిట్ ఆఫ్ డౌట్ కింద అంపైర్లు నాటౌట్ గా ప్రకటించాల్సింది.కానీ ఇలా అంపైర్ల ఏకపక్ష నిర్ణయంతో తాము భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని కీలకమైన ఫైనల్ మ్యాచ్ లో ఇలాంటి తప్పుడు నిర్ణయాలకు తాము బలయ్యామని… లేదంటే ఈ ఐపిఎల్ సీజన్ 12 ట్రోఫీ తమదేనని హర్భజన్ అంటున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Harbhajan Not Satisfied For The Dhoni Runout Decision- Related....