ఏపీలో మరోసారి పడగ విప్పిన కాల్ మనీ రాకెట్

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నాలుగేళ్ల క్రితం సంచలనంగా మారిన కాల్ మనీ రాకెట్ గురించి అందరికీ తెలిసిందే.కొంత మంది రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు పేద, మధ్యతరగతి ప్రజలకు భారీ వడ్డీలకు డబ్బులు ఇచ్చి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారని కేసులు నమోదయ్యాయి.

 Harassed By Call Money Racket-TeluguStop.com

ఈ కాల్ మని రాకెట్లో పలువురు ప్రముఖులని కూడా పోలీసులు అరెస్టు చేశారు.కాల్ మనీ రాకెట్ వలన ఆత్మహత్యలు చేసుకున్నవారు ఉన్నారు.

కాల్ మనీ రాకెట్ మాటున సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన అమ్మాయిలను శారీరకంగా వాడుకున్నారని ఆరోపణలు కూడా వినిపించాయి.విజయవాడ కేంద్రంగా నడిచిన ఈ కాల్ మనీ రాకెట్ లో ఏపీలో ప్రధాన పార్టీలకు చెందిన నేతలు కూడా ఉన్నారని చర్చ నడిచింది.

అయితే ఈ కేసు మీద ప్రభుత్వం విచారణ చేపట్టిన తర్వాత ఏ కారణాల వలనో ఈ వ్యవహారంలో పోలీసులు సైలెంట్ అయిపోయారు.

ఇదిలా ఉంటే మరో సారి గుంటూరు జిల్లాలో కాల్ మనీ వ్యాపారుల నుంచి కాపాడాలని నిరసన తెలియజేస్తూ తాడేపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

దీంతో మరోసారి ఈ వ్యవహారం రాజధాని ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది.ఉండవల్లికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి ఓ కాల్ మనీ వ్యాపారి దగ్గర ఆరు లక్షలు అప్పు తీసుకోగా అతని నుంచి వడ్డీ రూపంలో 23 లక్షలు వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నాడు.

డబ్బులు కట్టకపోతే చంపేస్తాం అని బెదిరిస్తున్నట్లు యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.దీనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

దీంతో స్థానికులు అతన్ని అడ్డుకొని కాపాడారు.ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారంతో మరోసారి కాల్ మనీ రాకెట్ చర్చనీయాంశంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube