ఈ యంగ్ హీరోను అందరూ టాలీవుడ్ యష్ అంటున్నారట.. ఇతనెవరంటే?

Happy With Tollywood Ysh Tag Says By Ram Asur Movie Hero

సాధారణంగా కన్నడ సినిమాలు ఇతర భాషల్లో డబ్బింగ్ అయినా ఆ సినిమాలలో ప్రేక్షకాదరణ పొందిన సినిమాలు తక్కువని చెప్పాలి.అయితే కేజీఎఫ్ సినిమా మాత్రం ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

 Happy With Tollywood Ysh Tag Says By Ram Asur Movie Hero-TeluguStop.com

కేజీఎఫ్ సినిమా వల్ల హీరో యష్ కు, ఆ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు ఊహించని స్థాయిలో పాపులారిటీ దక్కింది.వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీన థియేటర్లలో కేజీఎఫ్2 రిలీజ్ కానుందని సమాచారం.

ఇప్పటికే కేజీఎఫ్2 సినిమా షూటింగ్ పూర్తి కాగా ఈ సినిమా కొరకు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.ఎప్పుడు విడుదలైనా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

 Happy With Tollywood Ysh Tag Says By Ram Asur Movie Hero-ఈ యంగ్ హీరోను అందరూ టాలీవుడ్ యష్ అంటున్నారట.. ఇతనెవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే కొన్ని రోజుల క్రితం తెలుగులో విడుదలైన రామ్ అసుర్ సినిమాలో హీరోగా నటించిన అభినవ్ సర్దార్ తనను టాలీవుడ్ యష్ అని పిలుస్తారని చెప్పుకొచ్చారు.రామ్ అసుర్ సినిమాలో సూరి పాత్రలో నటించడంతో పాటు తన నటనతో అభినవ్ సర్దార్ మెప్పించారు.

అభిమానులు తనను టాలీవుడ్ యష్ అని పిలవడం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని అభినవ్ సర్దార్ చెప్పుకొచ్చారు.రామ్ అసుర్ మూవీలో లవర్ బాయ్ గా, అసురుడిగా భిన్నమైన పాత్రల్లో కనిపించి అభినవ్ సర్దార్ మెప్పించారు.

యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గా రామ్ అసుర్ మూవీతో సక్సెస్ అందుకున్నానని నటుడిగా తననుతాను మెరుగుపరచుకుంటూ ఉంటానని అభినవ్ అన్నారు.తనను టాలీవుడ్ యష్ అని పిలుస్తుంటే చాలా ఆనందంగా ఉందని అభినవ్ అన్నారు.

Telugu Abhinav Sardar, Projects, Ram Asur, Suri Role, Yash-Movie

మరిన్ని డిఫరెంట్ కథలను ఎంచుకుని ప్రేక్షకుల ముందుకు వస్తానని అభినవ్ చెప్పుకొచ్చారు.ఇతర భాషలలో పెద్ద సినిమాలలో తనకు అవకాశాలు దక్కాయని ఆ వివరాలను తాను త్వరలోనే తెలియజేస్తానని అభినవ్ వెల్లడించారు.తన సంపాదనలో 10 శాతం డబ్బులను సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నానని అభినవ్ చెప్పుకొచ్చారు.

#Suri #Abhinav Sardar #Asur #Yash #Projects

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube