ఈ వార్త నిజం కాక పోవచ్చు కానీ నిజమైతే సంచలనమే!!     2019-01-06   11:34:46  IST  Ramesh Palla

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ఈ సంక్రాంతికి ‘పేట’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం తర్వాత రజినీ మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించడానికి ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. విభిన్నమైన థీమ్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి దర్శకుడు మురుగదాస్‌ ఇప్పటికే సన్నాహాలు షురూ చేశాడు. మురుగదాస్‌ చిత్రం తర్వాత రజినీ కార్తీక్‌ సబ్బరాజు దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. త్వరలో రజినీ రాజకీయ అరంగేట్రం చేయనున్నాడనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో వరుస చిత్రాలకు సైన్‌ చేస్తున్నాడు.

Happy With This News Of Rajamouli And Rajinikanth Combo Is Fixd-Petta Movie Release Date Rajamouli Rajanikanth Next Viral About

Happy With This News Of Rajamouli And Rajinikanth Combo Is Fixd

మురుగదాస్‌, కార్తీక్‌ సుబబ్బరాజులతో ప్రాజెక్ట్‌లు పూర్తి చేసుకున్నాక దర్శకధీరుడు రాజమౌళితో తళైవ ఓ చిత్రాన్ని చేయనున్నాడని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. రజినీ తాను ముందుగా ఇచ్చిన మాట ప్రకారం ప్రాజెక్ట్‌లు పూర్తి చేసి, రాజమౌళికి బల్క్‌ డేట్లను కేటాయించనున్నట్టుగా టాక్‌. ఈలోగా రాజమౌళి కూడా రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ల మల్టీస్టారర్‌ను పూర్తి చేస్తాడు. ఈ భారీ మల్టీస్టారర్‌ పూర్తి చేసి సూపర్‌స్టార్‌ కోసం ఓ మంచి కథను రెడీ చేస్తాడని టాక్‌.

Happy With This News Of Rajamouli And Rajinikanth Combo Is Fixd-Petta Movie Release Date Rajamouli Rajanikanth Next Viral About

ఈ వార్త నిజం కాకపోవచ్చు కానీ నిజమైతే మాత్రం సంచలనమే. తెలుగు సినిమా చరిత్రకు ఓ స్థాయిని తెచ్చి పెట్టిన దర్శకుడు రాజమౌళి సౌత్‌ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ల కాంభో అంటే అది మామూలు విషయం కాదు. వీరి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ వార్త నిజం అయితే భావుండు అని భావిస్తున్నారు. అయితే దీనిపై రజినీ, రాజమౌళి ఎలా స్పందిస్తానే అనేదాన్ని బట్టి ఇరువురి కాంభోలో భారీ చిత్రం ఉంటుందా? ఉండదా? క్లారిటీ వస్తుంది.