ఒకప్పుడు ఫర్వాలేదనిపించిన ఈ హీరోయిన్ ప్రస్తుతం అవకాశాల్లేక....

తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన “హ్యాపీ డేస్” చిత్రంలో రింగు రింగుల జుట్టు కలిగిన సీనియర్ స్రవంతి పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన తెలుగు హీరోయిన్ “సోనియా దీప్తి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.సోనియా  సినిమా పరిశ్రమకి వచ్చిన మొదట్లో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణించింది.

 Happy Days Movie Fame Sonia Deepti Movie Offers And Real Life News, Happy Days,-TeluguStop.com

కానీ తన చిత్రాల కథల విషయంలో అవగాహన లోపించడంతో ఎక్కువ కాలం హీరోయిన్ గా కొనసాగలేక పోయింది.

దీనికితోడు సోనియా దీప్తి నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం రెండో హీరోయిన్ మరియు కామియో అప్పీయరెన్స్ లేదా స్పెషల్ అప్పియరెన్స్ పాత్రలలో నటించింద.

దీంతో సినిమా పరిశ్రమలో తనకంటూ చెప్పుకోవడానికి సరైన హిట్ లేక తన ఉనికిని చాటుకునేందుకు చాలా కష్ట పడుతోంది. కాగా ప్రస్తుతం సోనియా దీప్తి సినిమా అవకాశాలు లేక ఇంటి పట్టునే ఖాళీగా గడుపుతోంది.

దీంతో తాజా సమాచారం ప్రకారం సోనియా దీప్తి సినిమాలకు గుడ్ బై చెప్పి వ్యాపారాలపై దృష్టి సారించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Telugu Happy Days, Happydays, Sonia Deepti, Telugu, Tollywood-Movie

ఈ విషయం ఇలా ఉండగా సోనియా దీప్తి తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లీష్ తదితర భాషలలో కలిపి దాదాపుగా 12 కు పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.కానీ ఇందులో ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.అందువల్లనే సోనియా దీప్తి సినిమాలకు గుడ్ బై చెప్పినట్లు కొందరు సినిమా పరిశ్రమలో చర్చించుకుంటున్నారు అయితే సోనియా చివరిగా 2017వ  సంవత్సరంలో “పురియట పురియర్” అనే తమిళ చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించింది.

కానీ ఈ చిత్రం కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.దీంతో అప్పటి నుంచి సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం సోనియా దీప్తి ఏం చేస్తుంది, ఎక్కడ ఉంది…? అనే విషయాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube