ఆ గుర్రానికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు.. ఊరంతా భోజనాలు..!

సాధారణంగా పెంపుడు జంతువులపై ఉన్న ప్రేమతో వాటిని ఇంటకి తెచ్చుకొని మరీ పెంచుకుంటూ ఉండడం సర్వ సాధారణం అయిపొయింది.ఇందులో ఎక్కువ శాతం కుక్కలు లేదా పిల్లలను పెంచుకుంటూ ఉండటం మనం చూసే ఉంటాం.

 Happy Birthday To That Horse Meals All Over The Place-TeluguStop.com

కానీ, తాజాగా బీహార్ కు చెందిన ఒక వ్యక్తి మాత్రం గుర్రాన్ని పెంచుకుంటూ దాని పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.

బీహార్ లోని సహర్సా జిల్లాకు చెందిన రజనీష్ కుమార్ అలియాస్ గోలూ యాదవ్ గుర్రం 6 నెలల వయసులో ఇంటికి తెచ్చుకొని అప్పటి నుంచి పెంచుకున్నాడు.ఆ గుర్రానికి చేతక్ అనే పేరును నామకరణం చేశారు.

 Happy Birthday To That Horse Meals All Over The Place-ఆ గుర్రానికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు.. ఊరంతా భోజనాలు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా చేతక్ పుట్టినరోజు ఘనంగా నిర్వహించే ఊర్లో వారందరిని పిలిపించి విందు భోజనాలను పెట్టించారు.ఆ విందులో శాఖాహారం, మాంసాహారం కూడా వడ్డించడం విశేషం.ఈ తరుణంలో గుర్రం పుట్టినరోజు సందర్భంగా ఉదయాన్నే గుర్రానికి స్నానం చేయించి 22.5 కేజీల కేకులు తయారు చేయించి ఆ కేకు మీద గుర్రం ఫోటో దాని పేరు కూడా రాయించాడు దాని ఓనర్.ఈ వేడుకలను ఊర్లో వారందర్నీ ఆహ్వానించి, అచ్చం మనుషులు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న విధంగానే ఆ గుర్రానికి కూడా పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా గోలూ యాదవ్ మాట్లాడుతూ.

తాను చేతక్ ను  ఎప్పుడు కూడా  ఒక జంతువు లాగా చూడలేదని, దాని తన కుటుంబంలో ఒక భాగంగా చూశానని చెప్పుకొచ్చాడు.అంతేకాకుండా ఈ రోజుల్లో మనుషులకంటే జంతువుల విశ్వాసంగా ఉంటాయని పేర్కొన్నాడు.

ప్రజలకు జీవ హింసను అడ్డుకోవాలని పెంపుడు జంతువులపై చూపించాలని విజ్ఞప్తి చేశాడు.అలాగే ఒక గుర్రానికి ఇలా పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

#22.5 Kg Cake #Horse Birthday #HorsePhoto #Bihar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు