హ్యాపీ బర్త్‌డే మెగాబ్రదర్‌ నాగబాబు  

happy birthday mega brother naga babu, Mega Family, Nagababu, Birthday, Chiranjeevi, Pawan Kalyan, Varun Tej, Niharika, Tv Serials, TV Shows, - Telugu @nagababuoffl, Birthday, Chiranjeevi, Happy Birthday Mega Brother Naga Babu, Mega Family, Nagababu, Niharika, Pawan Kalyan, Tv Shows, Varun Tej

బుల్లి తెర, వెండి తెర, యూట్యూబ్‌ ఇలా ఎక్కడ చూసినా కూడా నాగబాబు కనిపిస్తున్నాడు.చాలా ఏళ్ల క్రితం హీరోగా కూడా నటించిన నాగబాబు హీరోగా నిలదొక్కుకోలేక పోయాడు.

TeluguStop.com - Happy Birthday Mega Brother Naga Babu

నటుడిగా కెరీర్‌ ను కొనసాగిస్తూ వస్తున్న నాగబాబు నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు నిర్మించాడు.ఆరెంజ్‌ సినిమా మిగిల్చిన నష్టం వల్ల సినిమా నిర్మాణంపై నాగబాబు విరక్తి చెందాడు.

అప్పటి నుండి ఆ నష్టాలను పూడ్చేందుకు చాలా కష్టపడ్డాడు.టీవీ సీరియల్స్‌ చేయడంతో పాటు షోలకు జడ్జ్ గా కూడా వ్యవహరించాడు.

TeluguStop.com - హ్యాపీ బర్త్‌డే మెగాబ్రదర్‌ నాగబాబు-General-Telugu-Telugu Tollywood Photo Image

మొత్తానికి నాగబాబు ఆల్‌ రౌండర్‌ ప్రతిభతో మళ్లీ ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు.రాజకీయంగా కూడా క్రియాశీలకంగా జనసేన పార్టీలో వ్యవహరిస్తున్నాడు.

మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో లోక్‌సభ స్థానంకు పోటీ పడ్డాడు.రాజకీయంగా అంతగా నిలదొక్కుకోలేక పోతున్న నాగబాబు బుల్లి తెర మరియు వెండి తెరపై మాత్రం వరుసగా సినిమాలు మరియు షో లు చేస్తూ వస్తున్నాడు.

చిరంజీవి మరియు పవన్‌ కళ్యాణ్‌ లు వెనుక ఉన్నా కూడా వారి పేరును ఉపయోగించుకోకుండా సొంతంగానే నిలబడే ప్రయత్నం చేశాడు.తనకు తాను సొంతంగా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశాడు.

ఇక నాగబాబు ఇద్దరు పిల్లలను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.వరుణ్‌ తేజ్‌ హీరోగా ఇప్పటికే నిలదొక్కుకుని ఆకట్టుకుంటున్నాడు.

నిహారిక మాత్రం హీరోయిన్‌గా సక్సెస్‌ కాలేక పోయింది.అయినా కూడా నటిగా మంచి పేరు దక్కించుకుంది.

త్వరలో కూతురు పెళ్లి చేయబోతున్న నాగబాబు ప్రస్తుతం జీ తెలుగులో అదిరింది కార్యక్రమంకు జడ్జ్ గా చేస్తున్నాడు.నిహారిక పెళ్లి తర్వాత కూడా తండ్రి బాటలో సినిమాల్లోమరియు బుల్లి తెరపై కనిపించబోతున్నట్లుగా చెప్పింది.

నేడు నాగబాబు పుట్టిన రోజు.ఈ సందర్బంగా మా తరపున మీ తరపున హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

#Nagababu #Birthday #Chiranjeevi #Mega Family #Tv Shows

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Happy Birthday Mega Brother Naga Babu Related Telugu News,Photos/Pics,Images..