హ్యపీ బర్త్‌డే కింగ్‌ బిగ్‌బాస్‌

కింగ్‌.మన్మధుడు.అన్నమయ్య.బిగ్‌ బాస్‌ ఇలా ఏ పాత్ర చేసినా కూడా జీవించేసి ఆ పాత్రపై తనదైన ముద్ర వేయగల నటుడు నాగార్జున అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 Happy Birthday King Nagarjuna, Nagarjuna, Nagarjun Birthday Cdp, Nagarjuna Bday,-TeluguStop.com

అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా కూడా కెరీర్‌ లో శివ వంటి ఎన్నో సాహస ప్రయోగాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకుని తండ్రి చాటు తనయుడుగా కాకుండా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.ఎన్నో సూపర్‌ హిట్స్‌ ను అందుకున్న నాగార్జున బుల్లి తెరపై కూడా చాలా బలమైన ముద్రను వేయడం లో సఫలం అయ్యారు.

మీలో ఎవరు కోటీశ్వరుడు మరియు బిగ్‌ బాస్‌ షో లతో తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను అలరించాడు.వెండి తెరపై ఈమద్య కాస్త డల్‌ అయిన నాగార్జున బుల్లి తెరపై బిగ్‌ బాస్‌ తో సెన్సేషనల్‌ టీఆర్పీ రేటింగ్‌ను దక్కించుకున్నాడు.

అద్బుతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న నాగార్జున ఇద్దరు కొడుకులు నాగచైతన్య మరియు అఖిల్‌ లు సినిమాల్లో హీరోలుగా రాణిస్తున్నారు.ఈసమయంలో కూడా నాగ్‌ రొమాంటిక్‌ పాత్రలకు సిద్దం అయ్యాడు.

ఇంకా ఆయన క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు అనడంలో సందేహం లేదు.

Telugu Annamaya, August, Big Boss, Bigg Boss Show, Happy Nagarjuna, Manmadhudu,

ఆరు పదుల వయసు వచ్చినంత మాత్రాన ముసలి వాళ్లు అయినట్లు కాదు అంటూ నాగ్‌ ను చూస్తే అనిపిస్తుంది.ఆయన మరో ఇరు వై ఏళ్ల వరకు ఇలాగే ఉంటాడేమో అనిపిస్తుంది.ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా షూటింగ్స్‌ కు దూరంగా ఉంటున్న నాగార్జున వచ్చే వారం నుండి బిగ్‌ బాస్‌ షో కు సిద్దం అవుతున్నాడు.

ఈ సీజన్‌ తో మళ్లీ నాగార్జున సందడి చేయడం ఖాయం అనిపిస్తుంది.నేడు నాగ్‌ పుట్టిన రోజు.ఈ సందర్బంగా ఆయన అభిమానుల తరపున మరియు మా తెలుగుస్టాప్ టీం అందరి తరపున హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube