'మహానటి' పుట్టిన రోజు నేడు..విషెస్ చెబుతూ సందడి చేస్తున్న ఫ్యాన్స్!

Happy Birthday Keerthy Suresh Celebs And Fans Wish The Starlight On Turning 29

కీర్తి సురేష్ మహానటి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.తన నటనతో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

 Happy Birthday Keerthy Suresh Celebs And Fans Wish The Starlight On Turning 29-TeluguStop.com

ఈ సినిమాకు ముందు కీర్తి అంత బాగా నటిస్తుందని ఎవ్వరు అనుకోలేదు.ఈ సినిమాలో కీర్తి సురేష్ ను తీసుకున్నప్పుడు కూడా చాలా మంది విమర్శలు చేసారు.

ఈమెను ఎలా తీసుకున్నారు అంటూ కొంతమంది పెదవి విరిచారు.కానీ తన నటనతో విమర్శకులను సైతం మెప్పించింది.

 Happy Birthday Keerthy Suresh Celebs And Fans Wish The Starlight On Turning 29-మహానటి’ పుట్టిన రోజు నేడు..విషెస్ చెబుతూ సందడి చేస్తున్న ఫ్యాన్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కీర్తి ఒకనాటి హీరోయిన్ అయినా మేనక కూతురు అన్న విషయం తెలిసిందే.ఈ రోజు కీర్తి పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఆమెకు విషెస్ చెబుతూ సందడి చేస్తున్నారు.

కీర్తి 1992 అక్టోబర్ 17న జన్మించింది.ఈమె బాలనటిగానే తన కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోయిన్ గా నటించింది.కీర్తి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో పట్టా అందుకుంది.ఈమెకు వయోలిన్ వాయించడంలో కూడా అనుభవం ఉంది.

ఇన్ని టాలెంట్ లు ఉన్న కీర్తి తన నటనలో కూడా అందరిని మెప్పించింది.తెలుగులో ప్రెసెంట్ వరుస అవకాశాలు అందుకుంటుంది.ఇక ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది.మహానటి పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో కీర్తి సురేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఫ్యాన్ సందడి చేస్తున్నారు.

ప్రెసెంట్ కీర్తి సురేష్ మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా తో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమా గుడ్ లక్ సఖీ సినిమాలో కూడా నటిస్తుంది.

అంతేకాదు చిరంజీవి భోళా శంకర్ సినిమాలో చిరు కు చెల్లెలి పాత్రలో నటించ బోతుంది.ఇన్ని డిఫరెంట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.

మహేష్ సర్కారు సినిమా రిలీజ్ అయితే మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.మరి ఈ సినిమాల్లో కీర్తి ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.

#HappyKeerthy #Keerthy Suresh #Wishes #Keerthy Suresh #MahanatiKeerthy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube