దేవి శ్రీ ప్రసాద్ గురించి ఈ సీక్రెట్ మీకు తెలుసా?

సినిమాలలో అతని సంగీతం వినిపిస్తే చాలు ఎలాంటివారైనా కాలు కదపాల్సిందే.అతి చిన్న వయసులోనే సంగీతదర్శకునిగా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోల సినిమాలకు సంగీత దర్శకునిగా వ్యవహరించి అద్భుతమైన విజయాలను అందుకున్న రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ నేడు (ఆగస్టు 2) పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా అతని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

 Happy Birthday Dsp Devi Sri Prasad Birthday Special Story In Telugu-TeluguStop.com

గొర్తి సత్యమూర్తి, శిరోమణి దంపతులకు 1979 ఆగస్టు 2న దేవిశ్రీప్రసాద్ జన్మించారు.దేవి శ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి గొప్ప కథా రచయిత.ఈ విధంగా సినిమా నేపథ్యం ఉండటంతో దేవిశ్రీప్రసాద్ కు చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉంది.ఇకపోతే దేవిశ్రీప్రసాద్ వాళ్ల అమ్మమ్మ తాతయ్య పేర్లను కలిపి పెట్టుకున్నారు.

వాళ్ళ అమ్మమ్మ పేరు దేవి, వాళ్ల తాతయ్య పేరు ప్రసాద్.వీరిద్దరి పేర్లను కలిపి దేవిశ్రీప్రసాద్ గా తనకు పేరు పెట్టారు.

 Happy Birthday Dsp Devi Sri Prasad Birthday Special Story In Telugu-దేవి శ్రీ ప్రసాద్ గురించి ఈ సీక్రెట్ మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దేవి చిన్నప్పటి నుంచి మాండొలిన్ నేర్చుకున్నారు.

స్కూల్ కి వెళ్లే ఈ రోజుల్లో స్కూల్లో ఏం కావాలని అడిగితే.మ్యూజిక్ డైరెక్టర్ అవుతానని చెప్పేవారు.ఇంట్లో కూడా సంగీతంపై తనకు ఉన్న ఇష్టాన్ని తెలుసుకొని ఇతనిని సంగీతం వైపు ప్రోత్సహించారు.

Telugu Devi Sri Prasad Birthday, Dsp Birthday, Happy Birthday Dsp, Music Director Devisri Prasad Birthday Today, Telugu News Online-Movie

ఈ క్రమంలోనే ఒకరోజు దేవిశ్రీప్రసాద్ ఇంటికి ఎంఎస్‌ రాజు రావడంతో దేవి శ్రీ ప్రసాద్ గదిలో నుంచి వచ్చే సంగీత వాద్యాల శబ్దాలు విని ఓ సందర్భానికి ట్యూన్ ఇవ్వమని చెప్పడంతో దేవిశ్రీ రెండు రోజులకే అద్భుతమైన ట్యూన్ అందించి ఎంఎస్‌ రాజు గారిని ఫిదా చేశారు.ఆ విధంగా దేవిశ్రీప్రసాద్ పన్నెండవ తరగతి చదివే సమయంలోనే అతనికి దేవి సినిమాకు సంగీత దర్శకుడిగా అవకాశం వచ్చింది.ఆ తరువాత పలు సినిమాలకు సంగీత దర్శకత్వం బాధ్యతలు చేపట్టి అద్భుతమైన విజయాలను అందుకుని ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.

#Happy Dsp #MusicDevisri #Dsp #Devi Sri Prasad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు