సీతారామం సినిమాలో ఇంత పెద్ద తప్పా.. దర్శకుడు ఏ విధంగా క్లారిటీ ఇస్తారో?

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమా బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది.ఏ సెంటర్లలో ఈ సినిమా కలెక్షన్లు బాగానే ఉన్నాయని తెలుస్తోంది.

 Hanu Raghavapudi Seetharamam Movie Mistake Details Here Goes Viral Hanu Raghava-TeluguStop.com

మూడు రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు 9 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండగా ఫుల్ రన్ లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.అయితే సీతారామం సినిమా చూసిన నెటిజన్లు ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సీతారామం సినిమా ప్రధానంగా ఒక లేఖ ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడం గమనార్హం.రామ్ రాసిన లేఖ 20 సంవత్సరాల తర్వాత సీతకు ఏ విధంగా చేరిందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

అయితే సీత అసలు పేరు నూర్జహాన్ అని తెలిసిన రామ్ కు లెటర్ ను సీతా మహాలక్ష్మి పేరుతో పోస్ట్ చేస్తే ఆ లెటర్ ఆమెకు అందదని తెలుసు అని అయినప్పటికీ ఆ లెటర్ ను అదే పేరుతో పోస్ట్ చేశాడని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Big, Mrinal Thakur, Seetharamam, Sumanth, Tollywood-Movie

సినిమాకు లెటర్ కీలకం కాగా ఆ లెటర్ విషయంలో ఇంత పెద్ద తప్పును దర్శకుడు హను రాఘవపూడి ఏ విధంగా సమర్థించుకుంటారో తెలియాల్సి ఉంది.లెటర్ చిరునామాలో రెండు పేర్లను ప్రస్తావించినా బాగుండేదని మరి కొందరు నెటిజన్లు చెబుతున్నారు.సీతారామం అందమైన ప్రేమ కథ అని అయితే తప్పులు లేకుండా తెరకెక్కించి ఉంటే ఈ ప్రేమకథ రేంజ్ మరింత పెరిగి ఉండేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

వీక్ డేస్ లో సీతారామం కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.బింబిసార సినిమాకు కూడా పాజిటివ్ టాక్ రావడం సీతారామం సినిమాకు ఒకింత మైనస్ అవుతోంది.

దర్శకుడు హను రాఘవపూడి సీతారామం కథను నడిపించిన విధానం మాత్రం ఎంతో బాగుందని పలువురు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube