ఆ మలయాళ స్టార్‌ తెలుగు సినిమా క్యాన్సిల్‌ అయ్యిందా?

అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ ఒక చిత్రం చేసేందుకు కొన్ని నెలల క్రితం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.ఆ సినిమాను మహానటి మేకర్స్‌ అయిన అశ్వినీదత్‌ కూతురు స్వప్న ఇంకా ప్రియాంకదత్‌లు నిర్మించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

 Hanu Raghavapudi, Dulquer Salman, Malayalam Hero, Mahanati Fame  Dulquer Salman-TeluguStop.com

సినిమా షూటింగ్‌ ఇక త్వరలో ప్రారంభం అవ్వబోతుంది అనుకుంటున్న సమయంలో కరోనా వచ్చేసింది.కరోనా కారణంగా మొత్తం గందరగోళంగా పరిస్థితులు అయ్యాయి.

దుల్కర్‌ చేస్తున్న చిత్రాలు పూర్తి కాకపోవడంతో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త సినిమాను మొదలు పెట్టే అవకాశం లేదట.2021 పూర్తిగా ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల హను రాఘవపూడి దర్శకత్వంలో కమిట్‌ అయిన సినిమా క్యాన్సిల్‌ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.అయితే ఇప్పటి వరకు యూనిట్‌ సభ్యుల నుండి ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు.కరోనా కారణంగా అన్ని సినిమాలు కూడా ఆలస్యం అవుతున్నాయి.వాటి మాదిరిగానే ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది కాకుండా ఆ తర్వాత ఏడాది ప్రారంభం అయ్యే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Dulquer Salman, Dulquertelugu, Mahanatidulquer, Malayalam-

మహానటి చిత్రం తర్వాత తెలుగులో మంచి క్రేజ్‌ను దక్కించుకున్న దుల్కర్‌ సల్మాన్‌కు లేడీ ఫాలోయింగ్‌ బాగా ఉంది.అతడి ఇమేజ్‌కు తగ్గట్లుగా ఒక మంచి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ కథను హను రాఘవపూడి రూపొందించాడట.సినిమా మొదలు పెట్టాలనుకున్న సమయంలో మహమ్మారి ఎంటర్‌ అయ్యి ప్లాన్‌ అంతా చెడదొబ్బింది.

ఈ కాంబో కాస్త ఆలస్యం అయినా మొదలవ్వాలని చాలా మంది కోరుకుంటున్నారు.సినిమా క్యాన్సిల్‌ అయితే కాకపోవచ్చు అంటూ చాలా నమ్మకంగా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube