హన్సిక మంచి మనసు

హన్సిక అంటే మనకు అందమైన రూపు మాత్రమే కాదు .అందమైన మనసు కూడా గుర్తుకు వస్తుంది.

 Hansika’s Kind Gesture In 62nd Nadigar Sangam Meet-TeluguStop.com

ప్రతి ఏటా, తన పుట్టినరోజు నాడు ఒక అనాథని దత్తత తీసుకోవడం హన్సికకి అలవాటు.ఇప్పటికి హన్సిక 24 మంది చిన్నపిల్లల్ని దత్తత తీసుకుంది.

వారి వసతి,తిండి,చదువు … అన్ని సొంత తల్లిలా దగ్గరుండి చూసుకుంటుంది హన్సిక.ఏమాత్రం ఖాళి సమయం దొరికినా , మిగితా హీరోయిన్లల షాపింగులు, ఫారెన్ టూర్లు అంటూ తిరక్కుండా, అనాథ పిల్లలతో గడపటం ఈ అందాల బొమ్మకి అలవాటు

సెట్లో ఒక దర్శకుడికి ఎంత గౌరవం ఇస్తుందో .ఒక లైట్ బాయ్ కి కూడా అంతే గౌరవం ఇస్తుందట హన్సిక.ఆర్ధిక ఇబ్బందులో చిన్ననటులకి సహాయం చేయడం .తన పర్సనల్ టీంకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడం హన్సికకి ఉన్న మంచి అలవాట్లలో కొన్ని.మరో విషయం ఏమిటంటే .హన్సిక చేసిన సహాయం వేరే ఎవరో చెప్తే తప్ప బయటి ప్రపంచానికి తెలియదు.హన్సిక మంచితనాన్ని తెలిపే సంఘటన మరొకటి జరిగింది మొన్న.

ఆదివారం నాడు నడిగర్ సంఘం ( తమిళ నటుల సంఘం ) 62వ జనరల్ బాడి మీటింగ్ జరిగింది.అయితే షూటింగ్ బిజీ వాళ్ళ హన్సిక ఆ మీటింగ్ కి రావడం కష్టమైపోయింది.

తానూ రాకపోతే ఏం .తన చేతులు మాత్రం సహాయం చేస్తూనే ఉంటాయి.ఆరోజు మీటింగ్ కోసం సహాయపడ్డ 2000 మంది పేద కార్మికులకి తన డబ్బులతో అన్నం పెట్టింది హన్సిక.తమిళ నటుడు విశాల్ చెప్పేదాకా ఈ విషయం తెలిదండోయ్.

హన్సిక అంతే .సహాయం మాత్రమే చేస్తుంది … పేరు ఆశించదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube