షూటింగ్ లో అమ్మ ఇచ్చింది పోగొట్టుకున్న హన్సిక.. కానీ ఆ అబ్బాయ్ తెచ్చియడంతో?

Hansika Who Lost Her Mother Gift In The Shooting But The Boy Brought That

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నటి హన్సిక.ఈమె పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే.

 Hansika Who Lost Her Mother Gift In The Shooting But The Boy Brought That-TeluguStop.com

తన అందంతో ఎంతో మంది కుర్రాళ్ళ హృదయాలను ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ.ఇక తన నటనతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కూడా నటించింది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.ఇదిలా ఉంటే గతంలో తాను ఓ విలువైన వస్తువు పోగొట్టుకుంది.

 Hansika Who Lost Her Mother Gift In The Shooting But The Boy Brought That-షూటింగ్ లో అమ్మ ఇచ్చింది పోగొట్టుకున్న హన్సిక.. కానీ ఆ అబ్బాయ్ తెచ్చియడంతో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

2001లో సినీ ఇండస్ట్రీకి బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది హన్సిక.అలా పలు సినిమాలలో నటించింది.అంతేకాకుండా బుల్లితెర పై పలు సీరియల్స్ లో కూడా నటించింది.ఆ తర్వాత 2007లో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది.టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి సక్సెస్ అందుకుంది.

ఆ తర్వాత ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, రామ్ వంటి కొంత మంది స్టార్ హీరోల సరసన నటించింది.

ఇదిలా ఉంటే గతంలో హన్సిక ఓ సినిమా షూటింగ్ సమయంలో తన డైమండ్ రింగ్ పోగొట్టుకోవడంతో బాగా టెన్షన్ పడింది.

ఆ రింగ్ తన తల్లి గిఫ్ట్ అట.అంతే కాకుండా దాని విలువ దాదాపు మూడు లక్షలని తేలింది.అలా అక్కడ సెట్ లో ఉన్న వాళ్లంతా దాదాపు మూడు గంటల వరకు ఆ రింగును వెతికారట.కానీ రింగు దొరకకపొయేసరికి తిరిగి మళ్లీ షూటింగ్ ప్రారంభించారట.

Telugu Boy, Film Industry, Hansika, Heroine, Mother Gift, Shooting, Tollywood-Movie

అలా సాయంత్రం సమయంలో షూటింగ్ పూర్తయిన వెంటనే అక్కడ ఓ స్పాట్ అబ్బాయి హన్సిక రింగ్ తెచ్చి ఇచ్చాడట.ఆ రింగ్ వాష్ బేసిన్ దగ్గర దొరికిందని తనకు ఇచ్చాడట.వెంటనే హన్సిక సంతోషపడుతూ అతడికి ఐదువేల రూపాయలను బహుమతిగా ఇచ్చిందట.అలా ఆ రింగ్ గురించి గతంలో కొన్ని విషయాలు పంచుకుంది.పోయిందనుకున్న తన విలువైన వస్తువు దొరికినందుకు చాలా సంతోషంగా ఉందని.ఎందుకంటే అది తన తల్లి ఇచ్చిన గిఫ్ట్ అని అందుకే ఆ గిఫ్ట్ ఎంత విలువైనదని తెలిపింది హన్సిక.

ఇక హన్సిక నటిగానే కాకుండా వ్యక్తిగత పట్ల కూడా మంచి పేరు సంపాదించుకుంది.తను చాలా మంది అనాధ పిల్లలను దత్తత తీసుకొని వారి బాధ్యతలను తానే చూసుకుంటుంది.అంతేకాకుండా ఎంతోమంది అనాధలకు తన వంతు సహాయం చేస్తుంది.అభిమానుల్లో మంచి హీరోయిన్ గా నిలిచింది.ఇక ఈ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది.

తనకు సంబంధించిన ఫోటోలను, కొన్ని విషయాలను బాగా పంచుకుంటుంది.ఇక ఈమె కొంత కాలం సినిమాలకు దూరంగా ఉండగా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది.ఇక ఈ ఏడాది 105 మినిట్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు గతంలో ప్రకటించింది.

కానీ ఇప్పటివరకు ఈ సినిమా గురించి మళ్ళీ ప్రకటన చేయలేదు.

#Mother Gift #Hansika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube