Hansika Sohail Katuria Marriage: ఘనంగా హన్సిక సోహైల్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆపిల్ బ్యూటీ హన్సిక వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.వీరి వివాహం జైపూర్ లోని ముంటోడా ప్యాలెస్ లో అతి కొద్ది మంది సన్నిహితులు బంధుమిత్రుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

 Hansika Sohail Katuria Marriage Pics Viral On Social Media Details, Hansika, Soh-TeluguStop.com

ఇలా వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈమె ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కాగ తాజాగా పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా నెత్తింట చక్కర్లు కొడుతున్నాయి.

పెళ్లి కళ ఉట్టిపడేలా సాంప్రదాయ దుస్తులలో హన్సిక సోహెల్ కతురియా ఎంతో చూడముచ్చటగా ఉన్నారు.ఇలా వీరిద్దరూ తమ స్నేహితులతో పెళ్లికి ముందు కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇక సోహైల్ హన్సిక నుదుటిన సిందూరం పెడుతున్నటువంటి ఫోటోలతో పాటు,తనపై ప్రేమ కురిపిస్తూ ముద్దుల వర్షం కురిపిస్తూ ఉన్నటువంటి ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇక హన్సిక పెళ్లి ఫోటోలు వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు నెటిజెన్లు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.హన్సిక హీరోయిన్ గా మాత్రమే కాకుండా సోహెల్ కతురియాతో కలిసి వ్యాపారాలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఇలా బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి సోహైల్ ను ప్రేమించి హన్సిక తన లైఫ్ పార్టనర్ గా చేసుకున్నారు.ప్రస్తుతం వీరి వివాహ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Heroine Hansika Sohail Kathuria Marriage Photos Viral

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube