అవకాశాలు లేక బెలూన్స్‌ బిజినెస్‌ చేస్తున్న హీరోయిన్‌..?

హీరోయిన్స్‌ అవకాశాలు వచ్చినంత కాలం హీరోయిన్‌ గా చేస్తూ ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం మనం గతంలో చూసేవాళ్లం.కాని ఇప్పుడు హీరోయిన్స్‌ అలా కాదు.

 Hansika On Rumours Of Getting Into Balloon Business, Hansika, Movie Offers, Ball-TeluguStop.com

అవకాశాలు తగ్గుముఖం పడుతున్న సమయంలోనే బిజినెస్‌ లోకి అడుగులు పెడుతున్నారు.తమకున్న క్రేజ్‌ తో వ్యాపారాల్లో రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎవరికి తోచిన బిజినెస్‌ లో వారు అడుగు పెడుతున్నారు.ఇక హీరోయిన్‌ దేశముదురు బ్యూటీ హన్సిక బెలూన్స్ వ్యాపారం చేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈమధ్య కాలంలో ఈమె సన్నిహితులు మరియు మిత్రుల ఇంట్లో జరుగుతున్న వివాహాది శుభకార్యాలు మరియు పుట్టిన రోజు వేడుకలకు బెలూన్స్‌ సరఫరా చేస్తోంది.ఈ విషయంలో పలువురు పలు రకాలుగా ప్రచారం చేస్తున్నారు.

అయితే బెలూన్స్‌ బిజినెస్‌ గురించి వస్తున్న వార్తలను ఆమె ఖండించింది.తనకు ప్రస్తుతానికి వ్యాపారం చేసేంత సమయం లేదని చెప్పుకొచ్చింది.

నేను ఈ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయాలో నాకు అర్థం అవ్వడం లేదు.నా గురించి నేను చేస్తున్న బిజినెస్‌ గురించి ఇంతగా మీడియా వారు ఆలోచించడం ఆశ్చర్యంగా ఉంది.

Telugu Balloon, Bussiness, Deshamuduru, Hansika, Hansikarumours, Offers, Rumors-

నా మనసులో లేని విషయాలను కూడా వారు రాస్తున్నారు అంటే వారు గొప్ప వారు అనుకోవచ్చు.నా కుటుంబంలో ఒకరికి బెలూన్స్‌ బిజినెస్‌ ఉందని దాన్ని నేను చూస్తున్నాను అంటూ వారు రాసిన కథనం నాకు నవ్వు తెప్పించడంతో పాటు పిచ్చి ఎక్కించేలా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.హీరోయిన్‌ గా ఇంకా కెరీర్‌ లో బిజీగా ఉన్న తన గురించి ఇలాంటి వ్యాఖ్యలు కథనాలు రాయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ కామెంట్స్‌ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube