నాకు త్రిషకి మధ్య అలాంటిదేమీ లేదు - హన్సిక

ఒక సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటె ఫర్వాలేదు.ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు.

 Hansika Responds On Rumors About Her Relationship With Trisha-TeluguStop.com

ఇద్దరు హీరోయిన్లు ఉంటేనే సమస్య.నా కాస్త్యుమ్స్ కన్నా తన కాస్త్యుమ్స్ బాగున్నాయి, తనకి హీరోకి మధ్య ఎక్కువ సీన్లు పెట్టారు, ఎక్కువ పాటలు ఇచ్చారు, తను నాకంటే అందంగా ఉంటుందా .ఇలా హీరోయిన్లు ఒకరినొకరు మాటలు అనుకుంటూ ఉంటారు, ఇద్దరు , ముగ్గురు హీరోయిన్లు ఒకే సినిమాలో ఉంటె కష్టం అబ్బ ! ఇవీ ఇండస్ట్రీలో మనం వినే మాటలు.

అరన్మనై 2 ( తెలుగులో కళావతి ) మొదలవగానే ఎన్నో అనుమానాలు.

త్రిష, హన్సిక లాంటి అగ్రశ్రేణి కథానాయకులు ఒకరి పట్ల ఒకరు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో, ఒకరితో ఒకరు ఎలా మేలుగుతారో అని.షూటింగ్ అంతా బాగానే జరిగిందా అంటే దేవుడెరుగు కాని, వీరిద్దరికీ పడట్లేదని, షూటింగ్ సమయంలో ఇద్దరికీ విబేధాలు వచ్చాయని, అందుకే ఇద్దరు టాప్ హీరోయిన్స్ ని ఒకే సినిమాలో తీసుకోకూడదని కహానిల మీద కహానీలు రాసేసింది తమిళ మీడియా.కాని అవేవి నిజం కాదంటోంది హన్సిక.

” ఈ రూమర్స్ నేను వినడమే కాకుండా త్రిషకి వినిపించాను.ఇద్దరం నవ్వుకున్నాం.వాళ్ళు రాసినట్టుగా మా మధ్య ఎలాంటి గొడవలు లేవు.మేము ఈ సినిమాకు ముందు కూడా మంచి స్నేహితులం.మా మధ్య మంచి అనుబంధం ఉంది.

త్రిష లాంటి మంచి ఫ్రెండ్ తో కలిసి సినిమా చేయడం చాలా ఆనందంగా అనిపించింది.నేను ఈ రూమర్స్ ని పెద్దగా పట్టించుకోను.

నా నటన గురించి బాగా రాసినా, విమర్శిస్తూ రాసినా అవి గమనిస్తాను.మనలోని మంచి విషయాలతో పాటు తప్పులు కూడా తెలుసుకోవాలి కదా.” అంటూ చెప్పుకొచ్చింది హన్సిక.

అరన్మనై 2 ( కళావతి ), ఈ నెల 29న తమిళ తెలుగు బాషలలో విడుదల అవుతోంది.

ఇందులో సిద్ధార్థ్ హీరోగా నటించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube