పూరీ జగనాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన దేశ ముదురు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ హాన్సిక.దేశ ముదురు సినిమా తర్వాత టాలీవుడ్ లో ఈ భామ స్టార్ హీరోయిన్ గా మారుతుందని అందరూ భావించారు.
అయితే పెద్ద పెద్ద సినిమాలలో అవకాశాలు రాకపోయినా టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలే నటించింది.ఇంచు మించు కుర్ర హీరోలందరితో జత కట్టిన ఈ భామ కోలీవుడ్ లో మాత్రం మంచి అవకాశాలు అందుకుంది.
ఇక అతి తక్కువ టైంలోనే సౌత్ ఇండస్ట్రీలో ఎబ్భై సినిమాల రికార్డ్ ని పూర్తి చేసుకున్న హాన్సికకి ఈ మధ్యకాలంలో పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పాలి.
ఈ నేపధ్యంలో ఊహించని విధంగా ఈ భామ అదిరిపోయే అవకాశం టాలీవుడ్ లో సొంతం చేసుకుంది.
తాజాగా అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరపైకి వస్తున్నా సినిమాలో హాన్సికని నెగిటివ్ రోల్ కోసం దర్శకుడు తీసుకున్నట్లు తెలుస్తుంది.రొటీన్ హీరోయిన్ పాత్రలు చేసి విసిగిపోయిన హాన్సికకి కూడా త్రివిక్రమ్ చెప్పిన పాత్ర భాగా నచ్కాడంతో వెంటనే చేయడానికి ఒకే చెప్పేసింది అని తెలుస్తుంది.
దీంతో ఎ హీరో అయితే తనకి హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడో అదే హీరోకి విలన్ గా చేసిన ఘనత హాన్సిక సొంతం అవ్వనున్నట్లు తెలుస్తుంది.