అల్లు అర్జున్ పుష్ప కోసం బన్నీ దేశముదురు భామ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి జోడీగా టాలీవుడ్ లో దేశముదురు సినిమాతో తెరంగేట్రం చేసిన అందాల భామ హాన్సిక మోత్వానీ.ఈ అమ్మడు మొదటి సినిమాతోనే సాలిడ్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకొని వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వచ్చింది.

 Hansika Motwani Item Song For Allu Arjun, Tollywood, Telugu Cinema, South Cinema-TeluguStop.com

ఇప్పటి వరకు కెరియర్ లో 50 సినిమాలో హాన్సిక నటించింది.వీటిలో చాలా వరకు ఆమెకి నటిగా ఇమేజ్ పెంచాయి.

ఇక టాలీవుడ్ లో అత్యధిక సినిమాలు చేసిన హాన్సిక తరువాత కోలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడ స్టార్ హీరోలతో ఆడిపాడింది.తరువాత హీరో శింబుతో ప్రేమాయణం సాగించి పెళ్లి వరకు వెళ్ళింది.

తరువాత ఇద్దరూ బ్రేక్ అప్ అయ్యారు.అయితే బ్రేక్ అప్ తరువాత హాన్సికకి అవకాశాలు తగ్గిపోయాయి.

అడపాదడపా సినిమాలు చేస్తున్న అనుకున్న స్థాయిలో సక్సెస్ రావడం లేదు.ఈ నేపధ్యంలో ఇప్పుడు ఐటెం భామగా మారడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

తన మొదటి సినిమా హీరో అల్లు అర్జున్ తో ఐటెం సాంగ్ చేయడానికి హాన్సిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.ఫారెస్ట్ నేపధ్యంలో యాక్షన్ కథాంశంతో ఈ సినిమాని సుకుమార్ ఆవిష్కరిస్తున్నారు.

ఇక పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఇందులో ఐటెం సాంగ్ కోసం ముందుగా బాలీవుడ్ భామలని రంగంలోకి దించాలని అనుకున్నారు.అయితే ఇప్పుడు సుకుమార్ ఛాయస్ హాన్సిక వైపు మారిందని తెలుస్తుంది.

ఇప్పటికే ఆమెతో మాట్లాడి ఫైనల్ చేశారని టాక్ నడుస్తుంది.ఈ ఐటెం సాంగ్ కోసం హాన్సికకి బాగానే ముట్టజెప్పినట్లు బోగట్టా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube