బికినీతో అభిమానులు అవాక్కయ్యేలా చేసిన హన్సిక.. అలా కనిపించాలని?

చిన్న వయస్సులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి గ్లామర్ రోల్స్ ద్వారా హన్సిక మెప్పించిన సంగతి తెలిసిందే.కెరీర్ తొలినాళ్లలోనే పెద్ద హీరోల సినిమాల్లో ఎక్కువగా నటించిన హన్సిక ఎక్కువ కాలం స్టార్ హీరోయిన్ స్టేటస్ ను కొనసాగించలేకపోయారు.

 Hansika Motwani Bikini Look Goes Viral In Social Media, Bikinilook , Hansuka , T-TeluguStop.com

అయితే ఈ బ్యూటీకి సినిమాల్లో ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు.తాజాగా ఈ బ్యూటీ పుట్టినరోజు వేడుకలను మాల్దీవులలో జరుపుకున్నారు.

బికినీలో హన్సిక దిగిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి ఉండటంతో ఈ బ్యూటీ టీవీ సిరీస్ లలో ఎక్కువగా నటించారు.

బాలీవుడ్ సినిమాలలో చిన్నచిన్న పాత్రలతో నటిగా కెరీర్ ను మొదలుపెట్టిన పదహారు సంవత్సరాల వయస్సులోనే దేశముదురు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండియాలోని అన్ని భాషల సినిమాల్లో హన్సిక నటించడం గమనార్హం.

Telugu Bikini, Hansika Motwani, Kollywood, Maha-Movie

సందీప్ కిషన్ తో తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ సినిమాలో నటించిన హన్సిక ఆ సినిమా తర్వాత మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.ఎంత ఎదిగినా స్నేహితులకు ప్రాధాన్యత ఇస్తున్న హన్సిక స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.కొన్ని నెలల క్రితం వరకు బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ ప్రస్తుతం స్లిమ్ లుక్ లో దర్శనమిస్తున్నారు.సెకండ్ హీరోయిన్ రోల్స్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న ఈ బ్యూటీ మంచిపేరు తెచ్చిపెట్టే సినిమాలకు మాత్రమే ఓకే చెబుతున్నారు.

Telugu Bikini, Hansika Motwani, Kollywood, Maha-Movie

అయితే ఎంచుకుంటున్న సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్లు కాకపోవడంతో హన్సిక కెరీర్ లో ఆశించిన స్థాయిలో సక్సెస్ కావడం లేదు.ప్రస్తుతం కోలీవుడ్ లో మహా అనే సినిమాలో హన్సిక నటిస్తున్నారు.ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు కూడా హన్సిక చేతిలో ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube