తల్లి చేతిలో దెబ్బలు తిన్న హన్సిక.. ఏం జరిగిందంటే..?

దేశముదురు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హన్సిక ఆ సినిమా తర్వాత వరుసగా హీరోయిన్ ఆఫర్లను అందిపుచ్చుకుంటున్న సంగతి తెలిసిందే.సీనియర్ హీరోయిన్ అయినప్పటికీ తమిళంలో ఈ హీరోయిన్ కు ఆఫర్లు వస్తూనే అన్నాయి.

 Hansika Hitting By Her Mother Video Goes Viral In Social Media-TeluguStop.com

అయితే ఈ హీరోయిన్ తల్లిచేతిలో దెబ్బలు తిన్నారు.హన్సిక తల్లి చేతిలో దెబ్బలు తిన్న ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే హన్సిక చేసిన అల్లరి పని దెబ్బలు తినడానికి కారణం కావడం గమనార్హం.

 Hansika Hitting By Her Mother Video Goes Viral In Social Media-తల్లి చేతిలో దెబ్బలు తిన్న హన్సిక.. ఏం జరిగిందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హన్సిక వయస్సు 29 సంవత్సరాలు కాగా దెబ్బలు తింటున్న వీడియోను హన్సిక తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశారు.

హన్సిక మదర్ ఉదయం సూర్య నమస్కారం చేస్తున్న సమయంలో హన్సిక తల్లి చేతిలో బుక్ పెట్టి ఆమె సూర్య నమస్కారాలు చేయకుండా డిస్టర్బ్ చేశారు.ఆ తరువాత హన్సిక మదర్ హన్సికను కర్ర తీసుకొని కొట్టారు.

హన్సిక తల్లి కొడుతున్న వీడియోకు విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి ఆ వీడియోను రిలీజ్ చేశారు.

ప్రస్తుతం హన్సికను తల్లి కొడుతున్న వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతుండగా నెటిజన్లు ఈ వీడియోపై ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

హన్సిక తెలుగులో చివరగా సందీప్ కిషన్ హీరో నటించిన తెనాలి రామకృష్ణ ఎల్.ఎల్.బీ సినిమాలొ నటించారు.ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది.

ఈ సినిమా హిట్టై ఉంటే హన్సికకు తెలుగులో ఆఫర్లు పెరిగి ఉండేవి.

తమిళంలో ప్రస్తుతం హన్సిక మహా అనే సినిమాలో నటిస్తున్నారని తెలుస్తోంది.

పాత్రలకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను హన్సిక ఎంపిక చేసుకోవడం వల్లే హన్సిక నటిస్తున్న సినిమాల సంఖ్య తక్కువగా ఉందని తెలుస్తోంది.సీనియర్ హీరోలు హన్సికకు ఛాన్స్ ఇస్తే హన్సిక తెలుగులో మళ్లీ బిజీ అయ్యే అవకాశం ఉంది.

#MotherBeating #Social Media #Hansika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు