హాఫ్ సెంచరీ అదిరిందంటున్న బ్యూటీ

దేశముదురు చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ హన్సికా మోత్వాని, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోయింది.వరుసగా సక్సెస్ రావడంతో అమ్మడు దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.

 Hansika Happy With Her 50th Movie, Hansika, Hansika50, Maha, Tollywood News-TeluguStop.com

ఇక ఈ బ్యూటీ క్రమంగా తెలుగులో సినిమాలు తక్కువ చేసి తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.అయితే అమ్మడు అందంతో పాటు అభినయానికి తమిళ తంబీలు బ్రహ్మరథం పడుతూ వచ్చారు.

అక్కడ హన్సిక చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అవుతోంది.

ఇక ఈ క్రమంలోనే హన్సిక అప్పుడే తన 50వ చిత్రాన్ని పూర్తి చేసింది.

దర్శకుడు జమీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తి కావడంతో హన్సిక ఈ సినిమా గురించి ఓ ట్వీట్ చేసింది.తన కెరీర్‌లో 50వ చిత్రంగా వస్తున్న మహా, తనకు చాలా దగ్గరగా ఉన్న చిత్రం అని పేర్కొంది.

తాను 50 సినిమాలు పూర్తి చేసుకోవడం నిజంగా నమ్మలేకపోతున్నట్లు హన్సిక చెప్పుకొచ్చింది.ఇక తన 50వ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా ఈ సినిమా ఉండబోతుందని హన్సిక తెలిపింది.

కాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలో తమిళ హీరో శింబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

కాగా ఈ సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.కాగా ఈ సినిమాతో హన్సిక మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని, ఈ సినిమా తన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తిండిపోయేలా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

మరి ఈ బబ్లీ బ్యూటీ ల్యాండ్‌మార్క్ మూవీ అమ్మడుకి ఎలాంటి హిట్‌ను అందిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube