సినిమాలు లేక ఆల్బమ్స్ చేసుకుంటున్న హాన్సిక

బాలనటిగా హిందీలో ఎంట్రీ ఇచ్చి తరువాత టాలీవుడ్ లో దేశముదురు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ హాన్సిక మొత్వానీ.ఈ అమ్మడు మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ అమ్మడు తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వచ్చింది.

 Hansika Album Songs Create Sensation-TeluguStop.com

ఒకానొక దశలో స్టార్ హీరోయిన్ గా తన హవాని కొనసాగించింది.అస్సలు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ వచ్చింది ఈ అమ్మడు.

ఇక తెలుగులో అవకాశాలు తగ్గాయనే సమయంలో కోలీవుడ్ ఈ అమ్మడుని పిలిచి నెత్తిన పెట్టుకుంది.అక్కడ కూడా యంగ్, స్టార్ హీరోలతో జత కట్టి వరుస సినిమాలు చేసింది.

 Hansika Album Songs Create Sensation-సినిమాలు లేక ఆల్బమ్స్ చేసుకుంటున్న హాన్సిక-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏకంగా ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్ల సుదీర్ఘ కెరియర్ ని కొనసాగించింది.చాలా మంది హీరోయిన్స్ ని సాధ్యం కాని విధంగా 50 సినిమాలలో హీరోయిన్ గా హాన్సిక మోత్వాని నటించింది.

అయితే ప్రస్తుతం ఈ అమ్మడు కెరియర్ ముగింపు దశలో ఉంది.ఈ నేపధ్యంలో ఈ అమ్మడు ఓ వైపు వెబ్ సిరీస్ లని చేసుకుంటుంది.మరో వైపు ఆల్బమ్స్ చేస్తూ అలరించే ప్రయత్నం చేస్తుంది.ఇటీవలే హన్సిక నటించిన రెండు ప్రైవేట్ ఆల్బమ్స్ యూట్యూబ్ వేదికగా సంచలనం సృష్టిస్తున్నాయి.ఈ మ్యూజిక్ వీడియోలు హన్సికను మళ్లీ ఫామ్ లోకి తీసుకొస్తాయనే ఆశాభావం వ్యక్తం చేస్తోంది.మూడువారాల కిందట హన్సిక బూటీ షేక్ అనే ప్రైవేట్ పాటలో కనిపించింది.

తాజాగా మజా అనే మరో పాటతో హాన్సిక ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రముఖ సింగర్ బి ప్రాక్ ఆలపించిన ఈ పాటకు జానీ సాహిత్యంతో పాటు సంగీతం అందించాడు.

ఈ రొమాంటిక్ మెలోడీ పాటలో హన్సికతో పాటు గుర్మీత్ చౌదరి నటించాడు.మజా సాంగ్ కేవలం రెండు వారాలలో 44 మిలియన్లకు పైగా వ్యూస్ పొందింది.

ఏది ఏమైనా సినిమాల పరంగా కెరియర్ ముగిసిపోయిన హాన్సిక ఇలా ఆల్బమ్స్ చేసుకుంటూ లైమ్ లైట్ లో ఉండే ప్రయత్నం చేస్తుందని చెప్పాలి.

#ActressHansika #South Beauty

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు