గ్యాంగ్ స్టార్ వికాష్ దుబే కథతో వెబ్ సిరీస్... అనుమతులు పొందిన నిర్మాత

ఉత్తరప్రదేశ్ లో ఇటీవల ఏకంగా 8 మంది పోలీసులని అతి కిరాతకంగా చంపిన వికాష్ దుబే తరువాత పోలీసులకి లొంగిపోయి వారి చేతిలో ఎన్ కౌంటర్ కి గురై మరణించిన సంగతి తెలిసిందే.వికాష్ దుబే పోలీసులని చంపిన తర్వాత వారిని మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చి అష్టదిగ్బంధనం చేసి తనకు తానుగా లొంగిపోయేలా చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళే క్రమంలో ఎన్ కౌంటర్ చేశారు.

 Hansal Mehta To Direct Web-series On Vikas Dubey, Uttar Pradesh, Bollywood, Ott-TeluguStop.com

  ఈ నేపధ్యంలో గ్యాంగ్ స్టార్ వికాష్ దుబే వ్యవహారం దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.  సాధారణమైన వ్యక్తి గ్యాంగ్ స్టార్ గా ఎలా మారాడు.

కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు అంత కిరాతకుడుగా ఎలా మారాడు అనే విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం అందరికి పెరిగింది.ఈ నేపధ్యంలో అతని కథపై బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా మనసు పడ్డారు.

దీంతో గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే జీవితంపై ఓ వెబ్ సిరీస్ రూపొందించడానికి ప్లాన్ మొదలు పెట్టారు.  ఈ వెబ్ సిరీస్ కు బాలీవుడ్ డైరెక్టర్ హన్సల్ మెహతా దర్శకత్వం వహిస్తారు.

అయితే, ఇది నిజజీవిత గాథ కావడంతో దీన్ని తెరకెక్కించేందుకు  నిర్మాత శైలేష్ ఆర్ సింగ్ అవసరమైన అనుమతులను పొందారు.దీనిపై దర్శకుడు హన్సల్ మెహతా మాట్లాడుతూ, గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఉదంతంలో ఓ పొలిటికల్ థ్రిల్లర్ పాయింట్ ఉందని, అందుకే తాము తీయబోయే వెబ్ సిరీస్ అంత్యంత ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు.

ఈ వెబ్ సిరీస్ ప్రస్తుత సమాజాన్ని చూపిస్తుందని వివరించారు.  మరి ఈ వెబ్ సిరీస్ లో దర్శకుడు ఎలాంటి అంశాలని టచ్ చేయబోతున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube