పంజాబీ ఎన్ఆర్ఐలకు శుభవార్త : అమృత్‌సర్- బర్మింగ్‌హామ్ మధ్య త్వరలో ఎగరనున్న ‘హన్స్ ఎయిర్‌వేస్’’

అమృత్‌సర్ నుంచి బ్రిటన్‌కు తరచుగా ప్రయాణాలు సాగించే పంజాబీలకు శుభవార్త.యూకే కేంద్రంగా ఇటీవల స్థాపించబడిన హన్స్ ఎయిర్‌వేస్ .

 Hans Airways All Set To Connect Amritsar & Birmingham Cities , Hans Airways,  Bi-TeluguStop.com

అమృత్‌సర్ నుంచి బర్మింగ్‌హామ్‌ల మధ్య సర్వీసులను నడిపేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంది.ఇది భారత్, ఇంగ్లాండ్‌లలోని పంజాబీ ప్రవాసులకు బొనాంజా వంటిదంటున్నారు ఏవియేషన్ నిపుణులు.

అమృత్‌సర్ నుంచి ఇంగ్లాండ్‌కు ఎయిరిండియా వారానికి ఒక సర్వీసును మాత్రమే నడుపుతున్నందు వల్ల ఈ రూట్‌లో భారీ డిమాండ్ వుంది.దీంతో పంజాబ్ నుంచి లండన్‌కు వెళ్లేందుకు ఎన్ఆర్ఐలు , విద్యార్ధులు, ఇతరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పంజాబీ డయాస్పోరాను భారత్, యూరప్, నార్త్ అమెరికాతో అనుసంధానించాలని హన్స్ ఎయిర్‌వేస్ కృతనిశ్చయంతో వుంది.అంతేకాకుండా పంజాబ్‌లోని వ్యవసాయ ఉత్పత్తులను , ఇతర వస్తువులను నేరుగా బర్మింగ్‌హామ్, యూకేలోని ఇతర నగరాలకు ఎగుమతి చేసే అవకాశం కూడా కల్పిస్తామని నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు.

సీఏఏ నుంచి హన్స్ ఎయిర్‌వేస్ .ఎయిర్ ఆపరేటర్స్ సర్టిఫికేట్ (ఏవోసీ) పొందే పనులు చివరి దశకు చేరుకున్నాయి.అన్ని లాంఛనాలను పూర్తి చేసుకుని రాబోయే వారాల్లో షెడ్యూల్ చేసిన కార్యకలాపాలను ప్రారంభించడానికి తాము సిద్ధంగా వున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Telugu Amritsa, Birmingham, Britain, England, Hans Airways, India, Landon, Punja

కాగా.హన్స్ ఎయిర్‌వేస్బోర్డులో భారత సంతతికి చెందిన బ్రిటీష్ పీర్ బారోనెస్ ఉషా ప్రషార్‌ ఇటీవల నియమితులైన సంగతి తెలిసిందే.ఉషా ప్రషార్ ప్రస్తుతం యూకే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ)కి చైర్‌గా వ్యవహరిస్తున్నారు.

అలాగే సమాజం ఎదుర్కొంటోన్న సమస్యలపై చర్చించే విద్యా సంస్థ కంబర్ ల్యాండ్ లాడ్జ్‌కు కూడా ఆమె చైర్‌గా వున్నారు.హన్స్ ఎయిర్‌వేస్ సీఈవో సత్నాం సైనీ గతవారం మాట్లాడుతూ.

ప్రైవేట్ రంగం, ప్రజా వ్యవహారాలలో ఉషా ప్రహార్‌కు నిబద్ధత, అనుభవం వుందన్నారు.సామాజిక సమస్యలపై ఆమె గళమెత్తుతారని సైనీ ప్రశంసించారు.

విమానయానాన్ని ప్రజలకు చేరువ చేయడంలో ఉష ఆసక్తిగా వున్నారని ఆయన కొనియాడారు.మా బోర్డులో చేరేందుకు ఆహ్వానాన్ని అంగీకరించడంతో పాటు మా దార్శనికతను పంచుకున్నందుకు సత్నాం సైనీ హర్షం వ్యక్తం చేశారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube