రాత్రి తాగింది దిగలేదా అయితే ఆఫీస్ కి సెలవు పెట్టొచ్చు ఎక్కడో తెలుసా... !

సాధారణంగా ప్రయివేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకి వారాంతంలో వచ్చే శని,ఆదివారాల్లో సెలవులుంటాయి.దీంతో కొందరు చిల్ అవ్వడానికి ఆదివారం రాత్రి  ఫుల్లుగా తాగి ఎంజాయ్ చేస్తారు.

 Hangover Holidays To Employees By A Company-TeluguStop.com

ఈ క్రమంలో కొందరికి మరుసటి రోజున ఆఫీస్ కి వెళ్లాలని గుర్తుండదు.కానీ తెల్లారి లేచి చూస్తే సోమవారం కచ్చితంగా ఆఫీస్ కి వెళ్ళాలి.

ఒకవేళ  ఆఫీస్ కి వెళ్లే మూడ్ లేకున్నా కొన్ని సంస్థల్లో ఐతే  కచ్చితంగా వెళ్ళాలి.మరి కొందరైతే హ్యాంగోవర్ తోనే ఆఫీస్ కి వెళుతారు.

దీంతో పని మీద శ్రద్ద వహించక తల నొప్పితో బాధపడుతారు. అయితే ఈ సమస్యను అధిగమించడానికి  ఇంగ్లాండ్ లోని ఒక డిజిటల్ మార్కెటింగ్ ప్రయివేట్ సంస్థ హ్యాంగోవర్ హోలీ డేస్ అనే పేరుతో తమ సంస్థలో పని చేసే ఉద్యోగులకు అదనపు సెలవులను కల్పించింది.
 

ఐతే ఈ విషయం గూర్చి తమ సంస్థ ప్రతినిదులను అడుగగా చాల మంది ఉద్యోగులు రాత్రి ఫుల్లుగా మద్యం సేవించిన తర్వాత సరిగ్గా నిద్ర పోవడం లేదని, దాంతో అలాగే ఆఫీస్ కి వస్తున్నారని తెలిపారు.హ్యాంగోవర్ కారణంగా పని కూడా సరిగా చేయకపోగా తాము పని చేసే బల్లపై పాడుకుంటున్నారని అన్నారు.

మరికొందరైతే మద్యం మత్తు దిగని కారణంగా ఆఫీస్ కి  వచ్చే సమయంలో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు.

Telugu Briton, Company, Employees, England, Extraholidays-Latest News - Telugu

అయితే ఈ  సెలవులు  మద్యం తాగని వారికి కూడా వర్తిస్తాయని ఈ సంస్థ ప్రతినిదులు చెబుతున్నారు.ఎలాగంటే మద్యం తాగని వారు రాత్రి సమయాల్లో ఏదైనా పని చేస్తూ అలసిపోయినా లేక సరిగా నిద్రపోకపోయినా ఈ సెలవులను ఉపయోగిన్చుకోవచ్చని, అలాగే ఆఫీస్ కి రాలేని పక్షంలో ఇంట్లోనే ఉంది కూడా పని చేయొచ్చని సంస్థ అధికారులు చెబుతున్నారు.ఇది తెలిసిన ఇతర సంస్థల్లో పని చేసే ఉద్యోగులు తమకు కూడా ఇలాంటి సెలవులు కల్పించాలని తమ యాజమాన్యాలను కోరుతున్నారట… 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube