ఏపీకి రిపేర్లు చేయాలంటున్న చంద్ర‌బాబు.. ముందు పార్టీకి చేయండంటున్న త‌మ్ముళ్లు

ఏపీలో టీడీపీకి ఇప్పుడు ఎన్నో స‌మ‌స్య‌లు ఉన్నాయి.ఇంకా చెప్పాలంటే పార్టీలోనే ఎన్నో ర‌కాల వివాదాలు ఉన్నాయి.

 Chandrababu Wants To Do Repairs To Ap The Siblings Who Are Going To Party Before-TeluguStop.com

వాట‌న్నింటినీ ప‌రిష్క‌రిస్తేనే రాబోయే ఎన్నిక‌ల్లో పార్టీ గెలిచేందుకు ఏమైనా ఆస్కారం ఉంటుంది.అలా కాద‌ని పార్టీని ఇలాగే వ‌దిలేస్తే మాత్రం మ‌రింత దిగ‌జారిపోవ‌డం ఖాయ‌మే.

చంద్ర‌బాబు నాయుడుకు రాజ‌కీయ చాణ‌క్యుడిగా పేరుంది.భ‌విష్య‌త్ ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకుని ప‌నిచేసే వ్యూహ చ‌తుర‌త క‌లిగిన నేత‌గా ఆయ‌న‌కు పేరుంది.

ఇదంద‌రికీ తెలిసిందే.కానీ ఇప్పుడు ప‌రిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది.

ఇప్పుడు జగన్ హ‌యాంలో తీసుకుంటున్న నిర్ణ‌యాలు ఆయ‌న‌కు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చిపెడుతున్నాయి.విప్లవాత్మకమైన నిర్ణయాల‌తో ఆయ‌న దూసుకుపోతుండ‌టంతో ప్ర‌తి ఎన్నిక‌ల్లో బంప‌ర్ మెజార్టీతో ఆ పార్టీ గెలుస్తోంది.

కానీ టీడీపీ మాత్రం ఇంటిపోరుతోనే స‌త‌మ‌త‌మ‌వుతోంది.కానీ చంద్ర‌బాబు పార్టీ ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ద‌కుండా ఏపీకి చాలానే రిపేర్లు చేయాలి కాబ‌ట్టి త‌మ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప‌నిచేస్తామని, రాబోయే ఎన్నిక‌ల్లో టీడీపీనే గెలుస్తుంద‌ని బ‌ల్ల గుద్ది మ‌రీ చెప్తున్నారు.

దీంతో త‌మ్ముళ్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Telugu Ap Potics, Chandrababu, Loesh, Tdp Candis, Ys Jagan, Ysrcp-Telugu Politic

ముందు పార్టీకి ఉన్న రిపేర్లు చేయ‌కుండా ఏపీలో ఉన్ని అన్ని రంగాల‌కు రిపేర్లు చేస్తామని చెప్ప‌డం ఏంటని వాపోతున్నారు.ఎందుకంటే ఇలాంటి ఇంటి పోరు పెట్టుకుని రాబోయే ఎన్నిక‌ల్లో ఎలా గెలుస్తామ‌నే బాధ‌ను చూపిస్తున్నారు త‌మ్ముళ్లు.ముందు పార్టీ అధికారంలోకి రావాలంటే ఇలాంటి ప‌రిస్థితులు పోయి అంతా ఒక్క‌గ‌తాటిపై న‌డిచిన‌ప్పుడే అది సాధ్యం అవుతుంది క‌దా అలాంటి వైపు అడుగులు వేయాలంటూ కోరుతున్నారు చాలామంది.

కాబ‌ట్టి చంద్ర‌బాబు ముందు ఇంట్లో గెలిస్తేనే ఆ త‌ర్వాత ర‌చ్చ గెలువ‌డానికి ఆస్కారం ఉంటుంద‌ని త‌మ్ముళ్ల మ‌నో వేద‌న‌.అలాంట‌ప్పుడే జ‌గ‌న్ పార్టీని ధీటుగా ఎదుర్కొంటామ‌ని అంతేగానీ రెబ‌ల్స్ గా మారుతున్న వ్య‌తిరేకుల‌తో పార్టీ ఎలా గెలుస్తుందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube