ఆదర్శం : ఈ పెళ్లి ఆహ్వాన పత్రికకు ప్రధాని కూడా ఫిదా అయ్యాడు

ఒకప్పుడు కాగితాల వినియోగం ఎక్కువగా ఉండేది.కాల క్రమేనా అన్ని డిజిటల్‌ అవ్వడం వల్ల కాగితాల వినియోగం భారీగా తగ్గింది.

 Handkerchief Used As Weddingcard In The Pune-TeluguStop.com

అయినా కూడా చెట్ల నరికివేత మాత్రం ఆగడం లేదు.ఆఫీస్‌లలో పేపర్ల వినియోగం తగ్గినా మరో రకంగా కాగితాలను వినియోగించడం మొదలు పెట్టారు.

కాగితాలను వాడవద్దని, తగ్గించాలని ఎంతగా చెప్పినా కూడా ప్రయోజనం లేకుండా పోతుంది.కాగితాలను అధికంగా వినియోగించడం వల్ల చెట్ల నరికివేతకు కారణం అవుతారు.

అందుకే ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు కాగితాలను వృదా చేయవద్దని ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయి.

పూణెకు చెందిన ఉదయ్‌ గాడ్గిల్‌ అనే వ్యక్తి కాగితాల వినియోగం తగ్గించేందుకు చేసిన ప్రయత్నంను ప్రధాని నరేంద్ర మోడీ కూడా అభినందించారు.

ఆయన కేవలం తాను మాత్రమే పాటించకుండా నలుగురు కూడా కాగితాల వినియోగం తగ్గించేలా తనవంతు ప్రయత్నాలు చేశాడు.ఇంతకు ఆయన కాగితాలను తగ్గించేందుకు ఏం చేశాడో తెలుసా వెడ్డింగ్‌ ఇన్విటేషన్స్‌ను పేపర్‌పై కాకుండా కర్చీఫ్‌పై ముద్రించడం.

చాలా ఏళ్లుగా ఉదయ్‌ గాడ్గిల్‌ ప్రిట్టింగ్‌ ప్రెస్‌ నడుపుతున్నాడు.అందరిని పెళ్లి కార్డులు పేపర్‌ వేసిన ఆయన తన కూతురు పెళ్లి కార్డు మాత్రం విభిన్నంగా ప్రయత్నించాడు.

Telugu Telugu Ups, Uday Gadgil, Verity Cards-Inspirational Storys

 అందరు ప్రత్యేకంగా చూడటంతో పాటు, పేపర్‌ వాడకం కూడా తగ్గించవచ్చు అనుకున్నాడు.అనుకున్నదే తడువుగా తాను ఎన్ని వెడ్డింగ్‌ కార్డులను కావాలనుకున్నాడో అన్ని వైట్‌ హ్యాండ్‌ కర్చిఫ్‌లను ఆర్డర్‌ చేశాడు.ఎక్కువ మొత్తంలో ఆర్డర్‌ ఇవ్వడం వల్ల తక్కువ రూపాయలే ఖర్చు అయ్యింది.ఆ వైట్‌ కర్చీఫ్‌లపై రసాయనాలు వాడని కలర్స్‌తో ప్రిటింగ్‌ చేశాడు.ఆ ప్రింట్‌ ఒకటి రెండు వాష్‌లకు పూర్తిగా పోతుంది.ఆ తర్వాత అది మామూలుగా రెగ్యులర్‌ కర్చీఫ్‌ అయిపోతుంది.

Telugu Telugu Ups, Uday Gadgil, Verity Cards-Inspirational Storys

 కర్చీఫ్‌పై పెళ్లి ఇన్విటేషన్‌ కార్డుకు అంతా ఫిదా అయ్యారు.ముద్రన చాలా అద్బుతంగా వచ్చిందని, ప్యాకింగ్‌ కోసం వాడిన మరో చిన్న క్లాత్‌ కవర్‌ కార్డు అందాన్ని మరింత పెంచింది అంటున్నారు.ఆయన కూతురు పెళ్లి పూణె మొత్తం హాట్‌ టాపిక్‌ అయ్యింది.ఈ విషయం సోషల్‌ మీడియా ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ వరకు వెళ్లింది.పేపర్‌ వాడకం తగ్గించేందుకు అద్బుతమైన ఆలోచన చేసిన మీకు అభినందనలు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా లేఖ పంపించారు.

Telugu Telugu Ups, Uday Gadgil, Verity Cards-Inspirational Storys

 ప్రస్తుతం ఉదయ్‌ గాడ్గిల్‌ వద్దకు ఇలాంటి ఇన్విటేషన్‌ కార్డులకు భారీగానే ఆర్డుర్లు వస్తున్నాయి.తన కూతురు వివాహ వెడ్డింగ్‌ కార్డు విభిన్నంగా ఉండాలని ప్రయత్నించిన ఉదయ్‌కి ఇప్పుడు అది మంచి ఆదాయ వనరుగా కూడా మారింది.కర్చీఫ్‌లపై ఇన్విటేషన్‌ కార్డు ఐడియా నిజంగా అందరికి ఆదర్శం.

పేపర్‌ను ఎంత తక్కువగా వాడితే అంత మంచిది.ఒక్కటి రెండు రోజులు ఉండే ఇన్విటేషన్‌ కార్డుకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయడంతో పాటు, ఎన్నో చెట్లను నాశనం ఎందుకు చేయాలి.

అందుకే ఉదయ్‌ గాడ్గిల్‌ ఐడియా దేశ వ్యాప్తంగా కూడా అమలు అవ్వాలని కోరుకుందాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube