చేతిరాత‌తో రాసిన రెజ్యూమ్...సోష‌ల్ మీడియాలో వైర‌ల్.!  

Handwritten Resume Gone Viral On Social Media-

జీవితం అంటేనే ఒడిదుడుకులమ‌యం.అందులో ఎత్తు ప‌ల్లాలు ఉంటాయి.క‌ష్ట సుఖాలు ఉంటాయి.క‌ష్టాలు వ‌చ్చిన‌ప్పుడు కుంగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగి పోరాటం చేస్తేనే విజ‌యం వరిస్తుంది.

Handwritten Resume Gone Viral On Social Media- Telugu Viral News Handwritten Resume Gone Viral On Social Media--Handwritten Resume Gone Viral On Social Media-

అయితే స‌రిగ్గా ఇదే సూత్రాన్ని అత‌ను వంట బ‌ట్టించుకున్నాడు.కనుక‌నే క‌నీసం రెజ్యూమ్‌ను ప్రింట్ చేసేందుకు కూడా డ‌బ్బులు లేని స్థితి నుంచి ఇప్పుడు మంచి జాబ్ చేసే స్థితికి చేరుకున్నాడు.

Handwritten Resume Gone Viral On Social Media- Telugu Viral News Handwritten Resume Gone Viral On Social Media--Handwritten Resume Gone Viral On Social Media-

అత‌ను కార్లోస్ డ్యుయార్టె.21 సంవ‌త్స‌రాలు.అర్జెంటీనా వాసి.

అత‌ను త‌న బామ్మ నుంచి కొంత డ‌బ్బు తీసుకుని జాబ్ సెర్చింగ్ ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు.అయితే కార్లోస్ కు ఎంత వెతికినా ఒక్క జాబ్ కూడా దొర‌క‌లేదు.అయినా అత‌ను నిరాశ చెంద‌లేదు.అయితే ఓ కాఫీ షాప్‌లో జాబ్ ఉంద‌ని తెలుసుకున్న కార్లోస్ అక్క‌డికి వెళ్లి ఎంక్వ‌యిరీ చేశాడు.

దీంతో అందులో ఉన్న మేనేజ‌ర్ కార్లోస్‌ను రెజ్యూమ్ ఇవ్వ‌మ‌ని అడిగాడు.

అయితే కార్లోస్ వ‌ద్ద నిజానికి అప్పుడు చిల్లి గ‌వ్వ కూడా లేదు.మ‌రి రెజ్యూమ్‌ను ప్రింట్ ఎలా తీయ‌గ‌ల‌డు.అయినా అత‌ను అధైర్య ప‌డ‌లేదు.ఒక పేప‌ర్ తీసుకుని అందులో త‌న వివ‌రాల‌ను చేత్తోనే రాశాడు.

పైన సీవీ అని రాసి కింద త‌న వివ‌రాల‌న్నింటినీ రాశాడు.దాన్నే మేనేజ‌ర్‌కు అంద‌జేశాడు.అయితే ఆ ఉద్యోగం అత‌నికి రాక‌పోయినా, ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ‌డంతో.అత‌నికి ఓ గ్లాస్ కంపెనీలో మంచి ఉద్యోగం ల‌భించింది.

అవును మ‌రి, చాలా ఇబ్బందికర ప‌రిస్థితి ఉన్న‌ప్ప‌టికీ అధైర్య ప‌డ‌కుండా పోరాటం చేశాడు కాబ‌ట్టే, మంచి జాబ్ అత‌న్ని వ‌రించింది.నేటి త‌రుణంలో స‌మ‌యాన్ని వృథా చేస్తున్న ఎంతో మంది కార్లోస్‌ను ఆద‌ర్శంగా తీసుకోవ‌చ్చు క‌దా.!