విడ్డూరం : హ్యాండ్‌ శానిటైజర్స్‌ అంటూ ఆవు మూత్రం అమ్ముతున్నారు, మీరు కాస్త జాగ్రత్త

ఇటీవలే దిల్లీలో గో మూత్ర పార్టీ అంటూ హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామీ చక్రపాణి మహారాజ్‌ నిర్వహించిన విషయం తెల్సిందే.గో మూత్రంను తాగడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటూ ఆయన ఈ పార్టీని నిర్వహించాడు.

 Hand Sanitizers With Gomutra Out Of From Corona Virus-TeluguStop.com

ఆ పార్టీ ఎలా జరిగిందో పక్కన పెడితే ఇప్పుడు గో మూత్రం కడుపులోకి తీసుకోవడమే కాకుండా శానిటైజర్స్‌ మాదిరిగా కూడా వాడవచ్చు అంటూ మరో సంస్థ ప్రచారం మొదలు పెట్టింది.

Telugu Corona India, Gomutra, Gomutram Suses, Handsanitizers, Medicalshops-Gener

దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా దాదాపుగా అన్ని మెడికల్‌ షాప్స్‌లో కూడా హ్యాండ్‌ శానిటైజర్స్‌ భించడం లేదు.ఒకటి రెండు చోట్ల ఉన్నా కూడా రెండు మూడు రెట్ల అధికా మొత్తానికి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇలాంటి సమయంలో హ్యాండ్‌ శానిటైజర్స్‌కు బదులుగా ఆవు మూత్రంను ఉపయోగించవచ్చు అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.

కొన్ని చుక్కల ఆవు మూత్రంను చేతిలో వేసుకుని చేయి అంతా కూడా తడిచేలా దాన్ని రుద్దుకుని ఆ తర్వాత చేతులను చల్లటి నీటితో కడుకోవాలంటూ కొందరు సూచిస్తున్నారు.

Telugu Corona India, Gomutra, Gomutram Suses, Handsanitizers, Medicalshops-Gener

ఆవు మూత్రంలో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయేమో కాని ఇలా శానిటైజర్స్‌ కూడా ఉపయోగించవచ్చా అంటూ అంతా నోరు వెళ్లబెడుతున్నారు.ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా యూపీలో ఈ గో మూత్ర శానిటైజర్స్‌ను అమ్మకానికి ఉంచినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.అయితే కొందరు మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు.

కాని కొందరు మాత్రం గో మూత్రం శానిటైజర్స్‌ తమకు కావాలంటూ ఆర్డర్స్‌ ఇస్తున్నారు.సబ్బుతో నిమిషం పాటు శుభ్రంగా కడుక్కుంటే చాలు.

ఏ ఇతర హ్యాండ్‌ శానిటైజర్స్‌.గో మూత్ర శానిటైజర్స్‌ అక్కర్లేదని వైధ్యులు సూచిస్తున్నారు.

కొందరు కావాలని ఇలాంటి పుకార్లు పుట్టినట్లుగా హిందుత్వ వాదులు కూడా గో మూత్ర శానిటైజర్స్‌పై విమర్శలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube