మీ చేతి వేళ్లే మీరెలాంటి వారో చెప్పేస్తాయట...ఎలాగో తెలుసుకుందామా

హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం శరీరం తొక్క బాహ్య లక్షణాలను బట్టి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు.ఇప్పుడు చేతి వేళ్ళను బట్టి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

 Hand Fingers Length Tells Your Personality-TeluguStop.com

చూపుడు వేలు, ఉంగరపు వేలితో సమానంగా ఉన్నవారు సమాజంలో మంచి గుర్తింపుతో పాటు మంచి సంపాదన పరులుగా ఉంటారు.

మధ్యవేలు, చూపుడు వేలు సమానంగా ఉండే వారు మంచి తెలివితేటలు కలిగి ఉండి ఇతరులపై ఆధిపత్యాన్ని కనపరుస్తారు.

 Hand Fingers Length Tells Your Personality-మీ చేతి వేళ్లే మీరెలాంటి వారో చెప్పేస్తాయట…ఎలాగో తెలుసుకుందామా-Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చూపుడు వేలు పరిమాణం తక్కువగా ఉండే వారు చాలా నిరాశగా ఉండి ఏ విషయాన్నీ ఆనందంగా వ్యక్తం చేయరు.

మధ్యవేలు కంటే చూపుడు వేలు పొడుగ్గా ఉండేవారు చాలా గర్వంతో ఉండి తామే గొప్పవాళ్లమని విర్రవీగుతారు.

చూపుడు వేలు ఉంగరపు వేలు కంటే పొడుగ్గా ఉండేవారు అల్ప సంతోషులు.అలాగే అత్యాశాపరులు.వీరి అత్యాశ ఒక్కోసారి వారు చేసే పనిని దెబ్బతీస్తుంది.

ఉంగరపు వేలి కంటే చూపుడు వేలు చిన్నగా ఉండే వారు చాలా నిశ్చింతగా ఉండుట వలన ఎప్పుడు ఆనందంగా ఉంటారు.

చూపుడు వేలు, చిటికెన వేలు సమానంగా ఉండే వారు మంచి వ్యూహాలను వేయటంలో దిట్ట.వీరు మంచి రాజకీయ నాయకులుగా రాణిస్తారు.

చిటికెన వేలి కంటే చూపుడు వేలు తక్కువ పొడుగుంటే అది దురదృష్టానికి చిహ్నంగా భావిస్తారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL