వీర బాదుడే: ఒకే రోజు సెంచరీ, హాఫ్ సెంచరీ..! ఎలాగంటే..?!

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో టీ20ల హవా నడుస్తోంది.కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఒక్కో సీరిస్ మొదలుకాబోతుంది.

 Hampshire Captain James Vince Century And A Half Century On The Same Day , James-TeluguStop.com

దీంతో క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా ఓకే రోజు రెండు మ్యాచులు ఆడిన ఓ ఆటగాడు అరుదైన ఘనతను సాధించాడు.ఓకే రోజు సెంచరీని అదే రోజు హాఫ్ సెంచరీని చేసి సత్తా చాటాడు.టీ20 బ్లాస్ట్‌ 2021 లో భాగంగా హాంప్‌ షైర్‌ క్రికెటర్ కెప్టెన్‌ జేమ్స్‌ విన్స్‌ ఓ రికార్డును నెలకొల్పాడు.ఒకే రోజులో ఆయన రెండు వేర్వేరు మ్యాచ్ లు ఆడాల్సి వచ్చింది.అందులో ఆ క్రికెటర్ సెంచరీ, అర్ధసెంచరీ చేసి అందర్నీ ఔరా అనిపించాడు.ససెక్స్‌, ఈసెక్స్‌ టీమ్ లతో ఆయన ఆడిన మ్యాచ్ లు జరగగా ఆ మ్యాచ్ లలో హాంప్‌షైర్‌ కెప్టెన్‌ జేమ్స్‌ విన్స్‌ ఈ ఘనతను సాధించడం విశేషంగా చెప్పొచ్చు.ఈ రెండు మ్యాచ్ ల్లోనూ హాంప్‌ షైర్‌ జట్టు ఘన విజయమే అందుకుంది.

ప్రారంభంలో ససెక్స్‌ టీమ్ తో ఆట మొదలైంది.

ఆ మ్యాచ్ లో 59 బంతుల్లో ఏకంగా జేమ్స్‌ విన్స్‌ 102 రన్స్ తో వీరబాదుడు బాధి అందర్నీ ఆకట్టుకున్నాడు.

అందులో 14 బౌండరీలు, 3 సిక్సులు ఉన్నాయి.ఇక చివరగా 16 పరుగులు చేసినట్లైతే మ్యాచ్ విజయం సాధిస్తామన్న టైంలో జేమ్స్‌ విన్స్‌ ఔటయ్యాడు.ఆ తర్వాత జో వెథర్లీ 24 నాటౌట్‌, లూయిస్‌ మెక్‌మనస్‌ 3 పరుగులు చేసి హాంప్‌షైర్‌ టీమ్ కు సక్సెస్ ను తెచ్చి పెట్టారు.మొదటగా బ్యాటింగ్‌ అందుకున్న ససెక్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టపోగా 183 రన్స్ చేసింది.

Telugu Century, Century Century, Hampshirejames, James Vince, Day-Latest News -

ఆ తర్వాత ఈసెక్స్ టీమ్ తో మ్యాచ్ జరిగింది.అందులో మొదటగా బ్యాటింగ్ చేసిన హాంప్‌షైర్‌ 20 ఓవర్లలో 171 రన్స్ చేసింది.ఆ మ్యాచ్ లో జేమ్స్‌ విన్స్‌ 63 రన్న్ చేశాడు.డీ ఆర్సీ షార్ట్‌ 30, గ్రాండ్‌హోమ్‌ 32 పరుగులు చేశారు.ఆ తర్వాత 172 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కి దిగిన ఈసెక్స్ జట్టు 153 పరుగులకు వెనుదిరిగింది.మొత్తగానికి ఈ వారంలో నాలుగు మ్యాచ్ లలో ఆడిన జేమ్స్ విన్స్ 2 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు చేసి భీకరమైన బ్యాటింగ్తో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube