విశాఖలో వింత.. సూర్యుడు చుట్టూ భారీ వలయం!

నిన్న విశాఖలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది.సూర్యుడు చుట్టూ అతి పెద్ద వలయం ప్రత్యేక్షమయ్యింది.

 Halo Around The Sun Spotted In Vizag Sky, Halo,sun, Vizag, Optical Phenomenon-TeluguStop.com

దీంతో విశాఖవాసులు ఆశ్చర్యానికి గురయ్యారు.అయితే ఆకాశంలో మేఘాలు ఎక్కువగా ఉండటం వల్ల సూర్యుడు కాంతి వక్రీభవనం చెంది ఇలా కనిపించినట్లు నిపుణులు తెలిపారు.
అయితే సూర్యుడు చుట్టూ వలయం ఏర్పడటంతో జనం అంత ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చి సూర్యుడిని ఆశ్చర్యంగా చూశారు.అంతేకాదు అంతరిక్షంలో ఏదో భారీ విస్పోటనం జరుగుతుందని అందుకే ఇలా కనిపించింది అంటూ చెప్పుకొచ్చారు.

అయితే సూర్యుడు చుట్టూ ఉన్న వలయం కొద్దిసేపటి తరువాత మాయం అయ్యి సాధారణ స్థితికి చేరింది.

కాగా రాత్రి పూట చంద్రుని చుట్టూ వలయం ఏర్పడం సహజమేనని.

కానీ సూర్యుని చుట్టూ వలయం ఏర్పడడం వింత అని చెప్పారు.కొందరు పెద్దలు ఇలాంటి వింత ఎన్నో ఏళ్లకు ఒక్కసారి మాత్రమే వస్తుందని చెప్తుంటారు.

అంతేకాదు సూర్యుడు చుట్టూ వలయం ఇలా ఏర్పడిన తర్వాత వచ్చే వారంలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు.వాతావరణ అధికారులు మాత్రం ఆకాశంలో మేఘాలు ఎక్కువగా ఉండటం వల్ల సూర్యుడు కాంతి వక్రీభవనం చెందింది అని చెప్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube