హైదరాబాద్ లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ మాజీ ఓఎస్డీ హరికృష్ణకు( OSD Harikrishna ) తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలతో హరికృష్ణ సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తనను సస్పెండ్ చేయడాన్ని హరికృష్ణ హైకోర్టులో( High Court ) సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం సస్పెండ్ చేసే అధికారం మంత్రికి లేదని తేల్చి చెప్పింది.
అలాగే కమిటీ విచారణలో ఆరోపణలు కూడా రుజువు కాకపోవడంతో హరికృష్ణ సస్పెన్షన్ ను హైకోర్టు ఎత్తివేసింది.







