బాలయ్య విగ్గు ధర అంతనా.. హెయిర్ స్టైల్ చేసేప్పుడు కొడుతాడేమోనని?

ప్రముఖ నటుడు రజనీ కాంత్ చేసిన రోబో, కథా నాయకుడు లాంటి సినిమాల్లో ఆయనకు హెయిర్ స్టైలిస్ట్‌గా చేసిన వ్యక్తి చందు.సూపర్ స్టార్‌కే కాదు టాలీవుడ్‌లో ప్రముఖ సినీ తారలకూ అద్భుతమైన హెయిర్‌ స్టైల్స్ చేస్తూ ప్రస్తుతం మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు.

 Hair Maker Chandu Revealed Real Facts About Balakrishna Wig Cost, Balakrishna, T-TeluguStop.com

తెర ముందు అందంగా కనిపించడం కోసం తెర వెనకాల చేసే ప్రతీ ఒక్కరిలోనూ చెప్పలేనంత కష్టం దాగి ఉంటుంది.అలాగే మగధీర సినిమాలో రామ్‌ చరణ్, నటి కాజల్‌కి కూడా వినూత్నమైన, అందమైన హెయిర్‌ స్టైల్స్‌ను రూపొందించి మంచి మార్కులు కొట్టేశారు చందు.

ఇక పోతే ప్రతీ దాంట్లోనూ వైరటీకి ప్రాధాన్యం ఇచ్చే నందమూరి బాలకృష్ణ తన హెయిర్ స్టైల్ విషయంలోనూ విభిన్నమైన ధోరణిని ప్రదర్శిస్తారని హెయిర్ స్టైలిస్ట్ చందు తెలిపారు.బాలకృష్ణ ఎక్కువగా మీడియం హెయిర్ స్టైల్‌నే ఫ్రిఫర్ చేస్తారని, స్టైల్‌ను బాగా మెయిన్‌టైన్ చేస్తారని ఆయన అన్నారు.

నిజానికి ఆయన హెయిర్ స్టైల్ చేయడం చాలా కష్టమని చందు అన్నారు.ఎందుకంటే ఆయన అస్సలు కాంప్రమైజ్ కారని, చాలా పర్‌ఫెక్ట్‌గా ఉండాలనే రూల్ పెడతారని ఆయన తెలిపారు.

ఏ చిన్న మిస్టేక్‌ని కూడా బాలకృష్ణ అస్సలు సహించరన్న చందు, హెయిర్‌ విషయంలో గానీ, గడ్డం విషయంలో గానీ చాలా కచ్చితంగా ఉంటారని ఆయన చెప్పారు.

ఇకపోతే అందరూ బాలకృష్ణకు కోపం ఎక్కువ, కొడతారని జనాలు ఎందుకు అంటారో తెలియదు గానీ, నిజానికి ఆయన చాలా మంచివారని చందు తెలిపారు.

అది ఆయనకు దగ్గరైన వాళ్లకే తెలుస్తుందని ఆయన అన్నారు.కొడతారు అంటారు గానీ అది నిజం కాదన్న ఆయన, అది అవతలి వాళ్ల ప్రవర్తన బట్టి కూడా అలా ఉంటారేమోనని ఆయన స్పష్టం చేశారు.

Telugu Balakrishna, Chandu, Tollywood, Wig Cost-Movie

ఇకపోతే బాలకృష్ణ ఇంటికి వెళ్లి కూడా చేశానన్న చందు, ఇంటికెళ్తే చాలా మర్యాదగా ఆదరిస్తారని అన్నారు.ఒకవేళ మా స్టాఫ్ ఎవరైనా చేస్తానంటే చందు నువ్వే చేయు అంటూ చాలా బాగా మాట్లాడుతారని ఆయన చెప్పారు.నా విషయంలో అయితే ఆయన నాకు చాలా మర్యాద ఇస్తారన్న చందు, నేను ఇంత మంది హీరోలకు చేశానని కూడా ఆయనకు చెప్పలేదని ఆయన తెలిపారు.

అంతే కాకుండా ఆయనకు వాడే విగ్‌ అంటే హెయిర్‌ చాలా కాస్ట్లీగా ఉంటుందని హెయిర్ స్టైలిస్ట్ చందు అన్నారు.దాదాపుగా ఆయనకు వాడే విగ్ ధర 1.25నుంచి 2 లక్షల వరకు ఉంటుందని ఆయన తెలిపారు.ఆయనకు ఆర్టీఫిషియల్ హెయిర్ సిస్టమ్‌ను ఫిక్స్ చేస్తామని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సినిమాల్లో న్యాచురల్‌గా కనిపించాలంటే ఆర్టిఫిషియల్ హెయిర్ సిస్టమ్‌నే వాడాలని అందుకే ఆయనకు దాన్ని ఫిక్స్ చేస్తామని చందు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube