వామ్మో.. జుట్టు రాల‌డం కూడా క‌రోనా ల‌క్ష‌ణ‌మేన‌ట‌!!

క‌రోనా.మూడ‌క్ష‌రాలే అయినా ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను అత‌లాకుత‌లం చేస్తోంది.మొద‌ట చైనాలో వెలుగు చూసిన ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో అన్ని దేశాలుకు వ్యాపించి ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చ‌ల‌గాటం ఆడుతోంది.ఇక ఈ మ‌హ‌మ్మారి ఎప్పుడు, ఎటు నుంచి వ‌చ్చి ఎటాక్ చేస్తుందో తెలియ‌క‌.ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావ‌డానికే భ‌య‌ప‌డుతున్నారు.

 Hair Loss Is Also The Symptom Of Coronavirus‌!! Hair Loss, Coronavirus, Covid--TeluguStop.com

ఈ ప్రాణాంత‌క క‌రోనాను అదుపు చేసేందుకు ప్రపంచదేశాలు రోజులు త‌ర‌బ‌డి లాక్‌డౌన్ విధించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకపోయింది.ఈ నేప‌థ్యంలోనే దేశాల‌న్నీ అన్‌లాక్ ప్ర‌క్రియ ప్రారంభించాయి.

దీంతో క‌రోనా అడ్డు అదుపు లేకుండా మ‌రింత వేగంగా విజృంభిస్తూ.ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను బ‌లితీసుకుంటోంది.

ఇదే స‌మ‌యంలో క‌రోనా గురించి కొత్త కొత్త విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి.

Telugu Coronavirus, Coronavirus Ups, Covid, Latest, Symptoms-Telugu Health

వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు కరోనా పేషంట్లలో జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, వాంతులు, డయేరియా, ముక్కు కారడం, ఒళ్లు నొప్పులు, వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయ‌ని నిర్ధారించారు.అయితే ఇప్పుడు తాజాగా ఈ లిస్టులోకి కొత్తగా మ‌రిన్న ల‌క్ష‌ణాలు వ‌చ్చి చేరాయి.అందులో ముఖ్యంగా జుట్టు రాలడం కూడా కరోనా వైరస్ లక్షణంగా గుర్తించారు ప‌రిశోధ‌కులు.

ఇండియానా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ కు చెందిన వైద్యులు చేపట్టిన పరిశోధనలో ఈ విష‌యం బ‌య‌ట ప‌డింది. తీవ్రమైన నరాల నొప్పి ఏకాగ్రత సమస్యలు, నిద్ర సమస్యలు, చూపు మందగించడంతోపాటు జుట్టు రాలడం కూడా క‌రోనా లక్ష‌ణాలే అని అంటున్నారు.

అంతేకాదు, మూడో వంతు కరోనా పేషంట్లలో 75శాతం జట్టును కోల్పోతున్నార‌ని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube